బరిలో ఇద్దరు సమఉజ్జీలు కొట్టుకుంటే ఎలా ఉంటుంది..రెండు కొదమ సింహాల మద్య పోరు ఎలా ఉంటుంది..ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ల ‘వార్’ అలాగే ఉంది.  యాక్షన్ హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరు హీరోలో త్వరలో ‘వార్’మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. యాష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ మూవీని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించాడు. టీజర్ లోని యాక్షన్ సీక్వెన్సెస్ ఊపిరిబిగపట్టేలా ఉన్నాయి.

ఒక విధంగా చెప్పాలంటే హాలీవుడ్ యాక్షన్ మూవీ కళ్లకు చూపించినట్లు అనిపిస్తుంది.  ఈ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటి వరకు ఎన్నూడ తీయలేదని చిత్ర యూనిట్ అంటున్నారు. ఇక తమ స్టార్ హీరోలు వార్ మూవీతో వస్తున్నారని తెలిసిన తర్వాత అభిమానుల అంచనాలు భారీగానే పెరిగిపోయాయి.  ఈ రోజు టీజర్ రిలీజ్ అయిన తర్వాత నరాలు తెగేలాంటి యాక్షన్ సీక్వెన్స్ చూసి అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయట.

మ్యాచో ఇమేజ్ ఉన్న హృతిక్ రోషన్ కు ఇలాంటి అసలైన సినిమా పడితే మరో ధూమ్ 2 అవుతుందని అంటున్నారు అభిమానులు. సూపర్ 30 మూవీ డిజాస్ట్రస్ టాక్ తో డీలాపడిన హృతిక్ అభిమానులకు ఈ మూవీ వినోదాల విందు ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ మూవీలో వాణికపూర్ అందాల ఆరబోత మరో హైలెట్ కాబోతుందట.  అక్టోబర్ 2న ఈ మూవీ విడుదల కానుంది. మూవీని సౌతిండియన్ లాంగ్వేజెస్ లోనూ డబ్ చేసి విడుదల చేస్తున్నారు. టీజర్ ను ఆయా భాషల్లో టెక్స్ట్ తో రిలీజ్ చేశారు ఇద్దరు హీరోలు.



మరింత సమాచారం తెలుసుకోండి: