టాలీవుడ్ లో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. భలే భలే మగాడివోయ్ సినిమా వరకు హిట్ ఫ్లాపులతో సతమతమవుతున్న నాని ఈ చిత్రం తర్వాత వరుస విజయాలతో దున్నేస్తున్నాడు. ఈ మద్య నాని నటించిన ‘జెర్సీ’ సూపర్ హిట్ కావడమే కాదు మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. తాజాగా మనం ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘‘నాని’స్ గ్యాంగ్ లీడర్’’.
జూలై 13న విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ అందరినీ విశేషంగా ఆకట్టుకోగా నేడు జూలై 15న చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. తాజాగా ఈ పోస్టర్ లో బామ్మ,వరలక్ష్మి,ప్రియ,స్వాతి,చిన్ను అంటూ అయిదు పాత్రలని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ని నాని విడుదల చేశారు. విచిత్రం ఏంటంటే ఈ పోస్టర్లో ఐదు రకాల వయసు ఉన్నా ఆడవాళ్లు ఉన్నారు..వారందరికీ నాని గ్యాంగ్ లీడర్ అనే కథంశంలా కనిపిస్తుంది. కథానుగుణంగా ఉన్న ‘నాని'స్ గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మీద అంచనాలని మరింతగా పెంచింది.
ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో డిఫరెంట్ లుక్‌లో ఉండే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 30న విడుదల కానుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ మూవీలో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు