జెర్సీ సినిమాతో మంచి విజయం సాధించిన నేచురల్ స్టార్ నాని తర్వాతి సినిమా ఏమిటని అందరు ఆశక్తిగా ఉన్నారు. నాని ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపధ్యంలో నాని తాజాగా వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ ఆధ్వర్యంలో సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

సోమవారం హీరో నాని,  డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘‘నాని’స్ గ్యాంగ్ లీడర్’’. జూలై 13న విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ అందరినీ విశేషంగా ఆకట్టుకోగా నేడు జూలై 15న చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో ‘‘బామ్మ.. వరలక్ష్మి.. ప్రియ.. స్వాతి.. చిన్ను..’’ అంటూ అయిదు పాత్రలని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ని నాని విడుదల చేశారు.

చిత్ర బృంధం విడుదల చేసిన పోస్టర్‌లో అయిదుగురు భిన్న వయస్కులైన ఆడవారితో కలిసి బైనాక్యూలర్స్ పట్టుకుని ఉన్న నానితో ఆకట్టుకునేలా డిజైన్ చేసిన ఈ పోస్టర్‌తో ఈ గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ లో ఉన్నదెవరో రివీల్ చేశారు. కథానుగుణంగా ఉన్న ‘నాని'స్ గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మీద అంచనాలని మరింతగా పెంచింది. ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌‌తో డిఫరెంట్ లుక్‌లో ఉండే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 30న విడుదల కానుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: