ఎన్టీఆర్.. మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ సినిమా సూపర్ హిట్ కొట్టింది.  ఈ సినిమా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.  ఓసారి ఎన్టీఆర్.. మోహన్ బాబు ను కలిసి మంచి కథ రాయించు సినిమా చేద్దాం అన్నారట.  


అసలే ఎన్టీఆర్ ఆరోగ్యం సరిగా లేదు.  ఆ సమయంలో సినిమా చేస్తే బాగుండదని చెప్పి.. మోహన్ బాబు సినిమాను పక్కన పెట్టారు.  కథ విషయం పెద్దగా పట్టించుకోలేదు.  ఓసారి మోహన్ బాబు ఎన్టీఆర్ కుటుంబంలో జరిగిన పెళ్ళికి హాజరయ్యారు.  ఎన్టీఆర్ ను తప్పించుకొని తిరిగారట.. అలా వెళ్ళబోతున్న సమయంలో కథ ఎంతమేరకు వచ్చింది అని అడిగితె.. పూర్తయ్యిందని చెప్పారట.  


ఆ వెంటనే పరుచూరిని పిలిచి జరిగిన సంగతి చెప్పి వెంటనే కథ కావాలని అడిగితె.. పాపం ఆ రాత్రి మొత్తం కూర్చొని కథను సిద్ధం చేసారట.  ఆ వెంటనే కథను ఎన్టీఆర్ వినిపిస్తే బాగుంది ప్రొసీడ్ అని చెప్పడంతో సినిమా స్టార్ట్ అయ్యింది.  


సినిమా డబ్బింగ్ పూర్తయ్యాక డబ్బింగ్ బాగా చెప్పలేదని అంటే.. ఏం బ్రదర్ డబ్బింగ్ బాగాలేదా అంటే.. అదేం కాదు.. ఎన్నికల ప్రచారం చేసి వచ్చి డబ్బింగ్ చెప్పారు కదా గొంతు కాస్త బొంగురు పోయినట్టు ఉందని అన్నారట ఎన్టీఆర్.  


మరింత సమాచారం తెలుసుకోండి: