శంకర్ రోబో సినిమా తరువాత భారతీయుడు 2 సినిమా చేయాలి.  షూటింగ్ మొదలైంది.  ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసి.. వెంటనే ఆపేశారు.  కారణం ఏంటో తెలియదు.  అదే సమయంలో ఎన్నికలు రావడంతో కమల్ హాసన్ ఎన్నికల హడావుడిలో బిజీ అయ్యారు.  


ఎన్నికలు పూర్తయ్యాయి.  ఎన్నికల తరువాత కూడా ఇంతవరకు ఈ సినిమా గురించిన ఎలాంటి సమాచారం లేదు.  దీనిపై అనేక అనుమానాలు వచ్చాయి. శంకర్ కు.. లైకా ప్రొడక్షన్స్ కు మధ్య అభిప్రాయం విభేదాలు వచ్చాయని, అందుకే సినిమా వాయిదా పడిందని అంటారు.  


వాయిదాకు అసలు కారణం ఉందట.  అదేమంటే... లైకా ఈ సినిమాకోసం లిమిటెడ్ బడ్జెట్ ను కేటాయించింది.  ఆ బడ్జెట్ లోనే సినిమా పూర్తికావాలి.  కానీ, అందుకు శంకర్ సిద్ధంగా లేకపోవడంతో సినిమా ఆగింది.  మరో పెద్ద ప్రొడక్షన్ కంపెనీలో శంకర్ సినిమా తీద్దామని ప్రయత్నించాడు.  


అది కుదరకపోవడంతో.. లైకా కంపెనీతో తిరిగి కలిసి పోయారని లైకా బడ్జెట్ లోనే సినిమా పూర్తి చేస్తారని తెలుస్తోంది.  ఆగష్టు నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట.  వచ్చే సమ్మర్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ గా పెట్టుకున్నారు.  మరి కాజల్ ఈ సినిమాలో చేస్తుందా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: