యంగ్ రెబల్ స్టార్, బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ సాహో సినిమాలో ఎంతో కీలకమైనది దుబాయ్ లో తీసిన ఛేజింగ్ పార్ట్. కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో తీసిన ఈ ఛేజింగ్ సీన్ గురించి ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలోను, సినిమా జనాలకు, ప్రభాస్ ఫ్యాన్స్ కి బాగా తెలుసు. ఇప్పుడు ఈ సీన్ విషయంలోనే సాహో యూనిట్ ఎంతో కేర్ తీసుకుంటోందని లేటెస్ట్ న్యూస్. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చుచేసి తీసిన సీన్ కు, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ లు జోడించుకుని బయటకు వచ్చినపుడు ఎలా వుండాలి? ఆ కోట్ల ఖర్చు కచ్చితంగా తెరపై కనిపించి, వండర్ అనిపించాలి. 

అయితే రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ లో ఛేజ్ ను జస్ట్ అలా టచ్ చేసి ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచారు. అందువల్ల పెద్దగా ఇంపాక్ట్ తెలియలేదు. కానీ సినిమాలో కొన్ని నిమిషాల పాటు వుంటుందట ఈ సీన్. అందుకే ఈ టోటల్ ఛేజ్ కు సంబంధించి, విఎఫ్ఎక్స్ క్వాలిటీ విషయంలో సాహో యూనిట్ చాలా కేర్ తీసుకుంటోందని సమాచారం.

అయితే మిగిలిన విఎఫ్ఎక్స్ పనులు చాలావరకు కంప్లీటయ్యాయి అయ్యాయి కానీ, ఈ ఛేజింగ్ వర్క్ మాత్రం ఇంకా పెండింగ్ వుందని ఇండస్ట్రీ నుండి అందిన ఫ్రెష్ అప్‌డేట్. ఈ ఛేజింగ్ సీన్ కు వర్క్ ఏమాత్రం అప్ టు ది మార్క్ లేకపోతే మొత్తం వ్యవహారం తేడా వస్తుంది. అందుకే ఆ వర్క్ విషయంలో హడావుడి పెట్టకుండా, జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే గతంలో కూడా కొన్ని భారీ సినిమాలకు విఎఫ్ఎక్స్ వర్క్ సరిగ్గా సెట్ కాకనే డిజాస్టర్ గా మిగిలాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: