సాధారణంగా చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఏ డిపార్ట్ మెంట్ లో సక్సస్ అయినా కూడా చివరికి కెప్టెన్ గా కుర్చీ లో కూర్చోవాలని అనుకుంటారు. అదేనండి మెగా ఫోన్ పట్టుకోవాలని..అంటే దర్శకుడవ్వాలని అర్థమనమాట. నటుడైనా, సంగీత దర్శకుడైనా, నిర్మాతైనా, యాక్షన్ కొరియోగ్రాఫర్ అయినా, డాన్స్ కొరియోగ్రాఫరైనా...మరీ ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ కూడా ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలనే కోరుకుంటాడు. కానీ ఈయన మాత్రం నిర్మాతగా మారారు. ఆయనే జ్ఞానశేఖర్. 

వేదం సినిమా నుంచి ఎన్టీఆర్ బయోపిక్ వరకు దర్శకుడు క్రిష్ చేసిన ప్రతి సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన జ్ఞానశేఖర్ నిర్మాతగా మారుతున్నారు. సృజన అనే ఒక కొత్త దర్శకురాలని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఇక కొత్త దర్శకురాలు రూపొందించబోతున్న సినిమాను క్రికెట్ నేపథ్యంలోని కథను ఆయన నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. పెళ్లిచూపులు వంటి సక్సెస్ ఫుల్ సినిమాను అందించిన రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తున్నారంటేనే ఈ కథ ఎలా ఉండబోతుందో అర్థమవుతోంది. 

ఈ సినిమాలో హీరో క్రికెట్ నేపథ్యంలో వున్న ముస్లిం యువకుడి పాత్రలో కనిపిస్తాడని సమాచారం. కథను విన్న తరువాత డెసిషన్ చెబుతా అన్న ప్రముఖ సంగీత దర్శకుడు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, కథనచ్చి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక జ్ఞానశేఖర్ కు సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరున్న సంగతి తెలిసిందే. మణికర్ణికతో సహా క్రిష్ దర్శకత్వం వహించిన సినిమాలు అన్నింటికీ ఆయన సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు. మంచి అవుట్ పుట్ ఇచ్చారు. ఇప్పుడు ఇలా మొదటిసారి నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: