హృతిక్ రోషన్ పెరువినగానే అందరికి కండలు తిరిగిన శరీరం గుర్తొస్తుంది.యాక్షన్ సినిమాలకు హృతిక్ పెట్టింది పేరు,అటు అందంలోను ఇటు అభినయంలోను హృతిక్ అభిమానులను సంపాదించుకున్నాడు.అయితే కొంత కాలంగా సరైన హిట్ లేక తల్లడిల్లి పోతున్నాడు హృతిక్ అందుకే వినూత్న మైన కథలను ఎంచుకుంటు అభిమానులను ఆశ్చర్య పరుస్తున్నాడు. 
2017 లో వచ్చిన కాబిల్ చిత్రంలో అంధుడిగా నటించి విమర్శకుల ప్రశంశలు అందుకున్నాడు, అదే తరహాలో 2019లో సూపర్30 లో ఓ సాధారణ గణిత శాస్త్ర ప్రావీణ్యుడిగా డీగ్లామర్ పాత్రలో నటించి బాక్స్ ఆఫీస్ ను కొల్లగొడుతున్నాడు. సూపర్30 మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇదిలా ఉండగా బాలీవుడ్ లో భారీ నిర్మాణ సంస్థ యస్ రాజ్ ఫిల్మ్స్ తాజాగా ఈరోజు "వార్" సినిమా టీజర్ ను రిలీస్ చేసింది.కండల వీరుడు హృతిక్ రోషన్,టైగర్ ష్రాఫ్ ఇద్దరు హీరోలు ఇందులో ప్రధాన పాత్రలుగ నటిస్తున్నారు.బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు.54సెకండ్ల నివిడి గల టీజర్ యూట్యూబ్ లో ఈరోజే రిలీస్ చేశారు. ఈ చిత్రం గాంధీ జయంతి రోజు రిలీజ్ చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: