ఆంధ్ర రాజకీయాలలో పచ్చగడ్డి మధ్య అగ్గిపుల్ల వెయ్యకముందే భగ్గుమనే అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి తెలుగుదేశం- వైసీపీ పార్టీల మధ్య. ఇటువంటి క్రమంలో ఒకే వేదికపై జగన్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ రానున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన కాకముందు అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నంది పురస్కార అవార్డుల ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేవి.


అయితే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా చీలిపోయింది నంది పురస్కార బహుమాన ప్రధానోత్సవ లను...కొన్ని అనివార్య కారణాలవల్ల వివాదాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్వహించలేదు. గతంలో  2014, 2015, 2016 సంవత్సరాలకు సంబంధించిన నంది పురస్కారాలను ప్రకటించారు. ఈ అవార్డులు ప్రకటించినపుడు పెద్ద రచ్చే నడిచింది. ఎందుకంటే ఈ మూడు సంవత్సరాలు ఉత్తమ పురస్కారాలు అందుకున్న హీరోల పేర్లు ఒకే సామాజిక వర్గానికి చెందడంతో...వారు మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, మహేష్ బాబు.


గతంలో ఈ నంది అవార్డుల పురస్కార ప్రధాన కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసారు. అయితే ఇటీవల ఏపీ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తో...ఈ నంది పురస్కారాల అవార్డుల ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తే కచ్చితంగా సీఎం హోదాలో జగన్ చేతుల మీదగా జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ మహేష్ బాబు మరియు మిగతా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు అందుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం...ఈ నంది ప్రధాన బహుమానాల ఉత్సవాలను...జరుపుతుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: