మధుర శ్రీధర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి అభిరుచి గల నిర్మాత. మంచి సినిమాలు తీయాలని ప్రయత్నిస్తూ వస్తున్నారు. కానీ సరైన కమర్షియల్ సక్సస్‌లే పడటడం లేదు. ఈ నేపథ్యంలో, దొరసాని సినిమాకు సరైన పాజిటివ్ రివ్యూలు రాలేదన్న ఫ్రస్టేషన్ తో, సమీక్షకుల మీద కాస్త గట్టి విమర్శలే చేసారు. ప్రేక్షకుల కోసం సినిమా తీయాలో? సమీక్షకుల కోసం సినిమా తీయాలో అర్థంకావడం లేదు. పెద్ద సినిమాలు తీయలేము, వైవిధ్యమైన చిన్న సినిమాలు తీస్తే ప్రోత్సాహం లభించడం లేదు అంటూ ఘాటుగా విమర్షించారు. 

కానీ శ్రీధర్ మరిచిపోయారేమో? ఆయన భాగస్వామ్యంతో వచ్చిన పెళ్లిచూపులు సినిమాను సమీక్షకులే భుజాన మోసారు. సినిమా విడుదలకు ముందే వరుసగా షోలు వేస్తే, సమీక్షకులు చూసి, ముందే సోషల్ మీడియాలో విపరీతంగా సినిమాకి హైప్ తీసుకువచ్చారు.
 
అంతేకాదు, గత నెలరోజుల్లో విడుదలైన గేమ్ ఓవర్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మల్లేశం, బ్రోచేవారెవరురా సినిమాలకు సమీక్షకులు ప్రశంసలు కురిపించారు కదా? అవన్నీ చిన్న సినిమాలే. మరి మధుర శ్రీధర్ ఇలా మాట్లాడడమేంటి? సినిమాకు మంచి సమీక్షలు రాలేదన్న బాధ వుండొచ్చు. కానీ అన్నీతెలిసిన, మీడియాతో ఎప్పుడు స్నేహం చేసే మధుర శ్రీధర్ లాంటి వాళ్లు కూడా ఒక్కసారిగా రగిలిపోతే ఎలా సార్ అంటు కామెంట్స్ పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: