రామ్ తో పూరి జగన్నాథ్  కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. సాధారణంగా పూరీ సినిమాలకు ఎ సర్టిఫికెట్, యు/ఎ సర్టిఫికెట్ రావడం కామన్. ఎందుకంటే రొమాన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్..వగైరా కావల్సిన అన్నీ ఉంటాయి కాబట్టి. అలానే ఇస్మార్ట్ శంకర్ సినిమాకు కూడా ముందు అనుకున్నాట్టుగానే ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఈ గురువారం విడుదలవుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఈ రోజు సెన్సారు జరిగింది. ఇస్మార్ట్ శంకర్ టీజర్, ట్రైలర్ దగ్గర నుంచి ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ వస్తుందని అంచనా వేస్తూనే వున్నారు అందరూ. పూరి - మహేష్ పోకిరి సినిమాకు కూడా అప్పట్లో ఏ సర్టిఫికెట్ వచ్చిన సంగతి తెలిసిందే. 

అలాంటిది ఫుల్ గా డబుల్ మీనింగ్ డైలాగ్ లు, డైరక్ట్ మీనింగ్ లు దట్టించిన ఇస్మార్ట్ శంకర్ కు ఏ కాకుండా మరో సర్టిఫికెట్ వస్తుందని ఎలా అనుకుంటారు? ఎవరైనా? పూరికి కూడా కావాల్సింది అదే. తానేం ఫ్యామిలీ మూవీ తీయలేదు. కుర్రకారు కోసం సినిమా తీసాడు. వాళ్లు రావడానికి ఎ సర్టిఫికేట్ ఏమీ అడ్డం కాదు. 

పూరి జగన్నాథ్  యూనిట్ నుంచి అందుతున్నసమాచారం ప్రకారం ఈసారి కావాలనే ఆయన కాస్త ఓవర్ ది బోర్డ్ వెళ్లినట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి తరువాత నుంచి సినిమాల్లో కాస్త ఘాటు పదాల వాడకం ఎక్కువయింది. వాస్తవానికి పూరి చాలా సినిమాల్లో ఎప్పుడో ఇలా ఘాటు పదాలు వాడారు. అందుకే ఈసారి మరింత డోస్ పెంచారు. దాంతో ఎ సర్టిఫికెట్ పక్కా అయింది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సస్ ను అందుకుంటుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమా సక్సస్ మొత్తం  యూనిట్ కి ఎంతో కీలకం. 


మరింత సమాచారం తెలుసుకోండి: