హాట్ అంటే ఏమో అనుకున్నారు. అలాంటి ఇలాంటి హాట్ కాదు, మే నెల ఎండలను మించే టాప్ రేంజి ఉష్ణోగ్రతలు రికార్డ్ కావాల్సిందే. టాప్ టు బాటం ఓ రేంజిలో వణుకు రావాల్సిందే. బ్యూటీ అంటే అల్టిమేట్ నేనే అనిపించేయాల్సిందే. ఇదీ నభా నటేష్ థియరీ.


ఇస్మార్ట్ శంకర్ మూవీ తొందరలోనే రిలీజ్ కాబోతోంది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది మాస్ మసాలా డైరెక్టర్ పూరీ జగన్నాధ్. ఆయన యూత్ మూడ్ ని పట్టేసే డైరెక్టర్. రాం పోతినేని హీరో, ఇద్దరు అందాల భామల్లో నభా ఒకరు. ఆమెకు ఇది ఓ విధంగా గోల్డెన్ చాన్స్ అంటున్నారు.


పూరీ చూపించాల్సినందంతా చూపించాడని అంటున్నారు. ఈ మూవీ చూసిన వారికి కనుల విందేనని చెబుతున్నారు. హాట్ హాట్ అందాలను వడ్డించేసిన నభా నభూతో నభవిష్యత్తు అంటోంది. ఇస్మార్ట్ శంకర్ లో రొమాంటిక్  మసాలా నసాలానికి అంటాల్సిందేనట. మరి కాస్కోండి.. సినిమా చూస్కోండి అంటోంది నభా. కుర్ర కారూ బీ రెడీ..


మరింత సమాచారం తెలుసుకోండి: