దగ్గుబాటి వారసుడు రానా ఓ పక్క క్రేజీ సినిమాలు చేస్తూనే మరో పక్క తెలుగులో సూపర్ హిట్టైన సినిమాలను ఇతర భాషలకు తీసుకెళ్తున్నాడు. రీసెంట్ గా సమంత లీడ్ రోల్ లో నటించిన ఓ బేబీ సినిమా తెలుగులో సూపర్ హిట్ అవడంతో ఈ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు రానా.


ఇదేకాకుండా ఈ ఇయర్ నానికి సూపర్ హిట్ అందించిన జెర్సీ సినిమాను రానా రీమేక్ చేస్తున్నాడని తెలుస్తుంది. తమిళంలో రానా నిర్మాతగా జెర్సీ రీమేక్ అవుతుందట. ఈ రీమేక్ లో ఎవరు నటిస్తారన్నది ఇంకా నిర్ణయించలేదు. రానా మాత్రం ఓ అప్కమింగ్ డైరక్టర్ తో జెర్సీ తమిళ రీమేక్ ప్లాన్ చేశాడట.


ఆల్రెడీ జెర్సీ సినిమా రిలీజ్ టైంలోనే ఈ మూవీని హిందిలో రీమేక్ చేసేందుకు చర్చలు జరిగాయి. బాలీవుడ్ లో ఈ రీమేక్ ఎవరు చేస్తున్నారు అన్నది తెలియలేదు కాని తమిళంలో మాత్రం జెర్సీని రీమేక్ చేసి తీరుతా అంటున్నాడు రానా. తన మనసుకి నచ్చిన సినిమాను మిగతా భాషల వారికి చూపించాలనే ప్రయత్నం చేయడం మంచి విషయం.  


అందులో రానా అందరికన్నా ముందుంటాడు. నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా మరోసారి నాచురల్ స్టార్ స్టామినా ప్రూవ్ చేసింది. సినిమాలో నాని నటనకు మంచి మార్కులు పడ్డాయి. కమర్షియల్ గా కన్నా ఈ సినిమాలో కాస్ట్ అండ్ క్రూకి మంచి గుర్తింపు, పేరు వచ్చిందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: