నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన మూవీ నిన్నుకోరి. నాని, నివేతా థామస్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. తెలుగులో లవ్ ఫెయిల్యూర్ కథలకు కొత్త అర్ధం చెప్పేలా న్యూ ట్రెండ్ సృష్టించిన సినిమా నిన్నుకోరి.


ఈ సినిమాతో టాలెంట్ చూపించిన శివ నిర్వాణ ఆ తర్వాత మజిలీ అంటూ వచ్చి మరో హిట్ అందుకున్నాడు. అయితే తెలుగులో సూపర్ హిట్టైన నిన్నుకోరి మూవీ ఇప్పుడు తమిళంలో రీమేక్ అవుతుంది. కన్నన్ డైరక్షన్ లో కోలీవుడ్ నిన్ను కోరి సినిమాలో అధర్వ, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


కాస్త అటు ఇటుగా నానిలానే ఉండే అధర్వ ఈ సినిమాను రీమేక్ చేయడం మంచి విషయమే. అయితే శివ నిర్వాణ లానే సినిమాను హ్యాండిల్ చేయగలడా లేదా అన్నది చూడాలి. ఈమధ్యనే మొదలైన ఈ సినిమాలో ఆది పినిశెట్టి పాత్రకు ఇంకా ఎవరు సెట్ అవలేదట. తెలుగు నిన్నుకోరిలో నటించిన ఆదిని అడిగితే చేయనని చెప్పాడట.    


అందుకే ఇప్పుడు ఆ పాత్ర కోసం వేట మొదలు పెట్టారు. మరి నాని కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ గా నిలిచిన నిన్నుకోరి తమిళ రీమేక్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం అధర్వ తెలుగులో వాల్మీకి సినిమాలో చేస్తున్నాడు. హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న వాల్మీకిలో వరుణ్ తేజ్ నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: