సినిమా ఛాన్సులు రాక కొంతమంది ఎదురుచూస్తుంటే అవకాశాలు వచ్చినా సరే అవి తమ కెరియర్ కు ఏమాత్రం ఉపయోగపడవని చెప్పేవారు కొంతమంది ఉంటారు. పోని ఒకవేళ అవకాశం వచ్చిందని సంబరపడినా పారితోషికం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని కొందరి వాదన. మాట్లాడుకున్న రెమ్యునరేషన్ ఇవ్వకుండా చేస్తారా అంటే అవుననే అంటుంది టాలీవుడ్ హాస్యనటి గీతా సింగ్. 


కొన్నాళ్లు ఆమె కామెడీతో కితకితలు పెట్టించగా ఇప్పుడు ఆమెకు ఎవరు సరైన అవకాశాలు ఇవ్వట్లేదు. ఇచ్చిన వారు కూడా రెమ్యునరేషన్ సరిగా ఇవ్వట్లేదు అని చెప్పుకొచ్చారు గీతా సింగ్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాల్లో మా లాంటి వారికి అన్యాయం జరుగుతుందని. సినిమా అవకాశాలు ఇవ్వట్లేదని వాపోయింది. 


పర భాషా నటులను తెచ్చి వారిని హోటెల్ లో ఉంచి మరి ఛాన్సులు ఇస్తున్నారు. కాని తమలాంటి వారికి మాత్రం అవకాశాలు ఇవ్వట్లేదని అంటున్నారు గీతా సింగ్. ఇక కొందరు డేట్స్ తీసుకుని తర్వాత తన ప్లేస్ లో వేరే వాళ్లను పెడుతున్నారని.. అలా చేయడం వల్ల తను వేరే ఆఫర్స్ వదులుకోవాల్సి వస్తుందని అన్నారు గీతా సింగ్.    


తెలుగు సినిమాల్లో ముందు తెలుగు వాళ్లకు అవకాశం ఇస్తే బాగుంటుందని అంటున్నారు గీతా సింగ్. ఇటీవలే 'మా' కొత్త ప్యానెల్ లో ఎంపికైన హేమ కూడా ఇదే విషయాన్ని ప్రస్థావించారు. గీతా సింగ్ డబ్బులను ఎగ్గొట్టిన నిర్మాతలు ఎవరో ఆమెను ఇబ్బంది పెట్టకుండా డబ్బులు ఇస్తే బెటర్ లేదంటే ఆమె చేసిన కామెంట్స్ నిర్మాతల మండలి వరకు వెళ్తే వాళ్లపై యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.         



మరింత సమాచారం తెలుసుకోండి: