Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 26, 2019 | Last Updated 12:47 pm IST

Menu &Sections

Search

భారతీయ సంస్కృతిలో అద్వితీయం గురు స్థానం !

భారతీయ సంస్కృతిలో అద్వితీయం గురు స్థానం !
భారతీయ సంస్కృతిలో అద్వితీయం గురు స్థానం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గురు స్థానం పరమ పవిత్రమైనది. అజ్ఞానపు చీకటి నుండి జ్ఞానమనే వెలుగును నలువైపులకు ప్రసరింప చేసే శక్తి ఒక్క గురువుకు మాత్రమే ఉంది. అటువంటి గురువును పూజించే సాంప్రదాయానికి నాందిగా ప్రతి సంవత్సరం ఆషాడ పౌర్ణమినాడు వచ్చే వ్యాదవ్యాసుడి జయంతిని ‘గురు పౌర్ణమి’ గా జరుపుకోవడం కొన్ని వేల సంవత్సరాల నుండి మన భారతీయ సంస్కృతిలో ఒక అంతర్భాగం.

గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మలా ఙ్ఞానాన్ని మనలో పుట్టించి విష్ణువులా రక్షించి శివుడిలా అఙ్ఞానాన్ని తొలగించి మంచి చెడులను విశదీకరించి మానవతా విలువలు మనకు నేర్పించే మహోన్నత వ్యక్తి అని మన సంస్కృతి చెపుతోంది.  వాస్తవానికి గురువు గుణాతీతుడు రూపరహితుడు భగవత్సమానుడు. జీవితం అంటే ఏవరికైన వెలుగు నీడల దాగుడు మూతలాంటిది. ఆటుపోట్లను తట్టుకుని జీవితంలో విజేతగా ఎలా నిలవాలో తెలుపగల వాడే నిజమైన గురువు.   

'గు' అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని 'రు' అంటే నిరోధించేవాడు అని అర్ధం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కనుకనే గురు స్థానానికి ప్రాముఖ్యత ఉంది. ‘గురుర్బ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: గురు: సాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమ: అంటూ నిరంతరం మన గురువు లను స్మరించుకోవాలని మన సనాతన హైందవ ధర్మం చెపుతోంది. మన జీవితంలో గురువులుగా భావించే వారు ఎవరంటే జన్మను ప్రసాదించిన అమ్మ విద్యనేర్పిన గురువు మంత్రోపదేశం చేసినవారు ఆయుధ విద్య నేర్పిన వారు వేదాధ్యయనము చేయించిన వారు పురాణ ఇతిహాసాలను తెలియజేసిన వారు దైవమార్గం వైపు నడిపించువారు మహేంద్రజాలాది విద్యలు నేర్పిన వారు మోక్ష సాక్షాత్కారము గురించి తెలియజేసినవారు గురువులు అవుతారు అంటూ వేదాలు చెపుతున్నాయి. 

గురు స్థానంలో ఉంటూ కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేసిన రామకృష్ణ పరమహంస ఆది శంకరులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు గురునానక్ దత్తాత్రేయుడు వర్ధమాన మహావీరుడు రమణ మహర్షి షిరిడీ సాయిబాబ భగవాన్ సత్యసాయిబాబా లను గురువులుగా స్మరించుకుంటూ ఈ గురు పూర్ణిమ రోజున వారి బోధనలను కోట్లాది మంది భారతీయులు గుర్తుకు చేసుకుంటూ ఉంటారు. గురువులను కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటే మంచి జరుగుతుంది. శిష్యుడు తన సద్గురువు పాదాలపై తన తలపెట్టి మ్రొక్కి ఆశీస్సులు తీసుకుంటే ఆ గురువు మహిమ చల్లని చూపుల వలన శిష్యుడికున్న సమస్త దోషాలు తొలగిపోతాయని మన పెద్దలు చెపుతూ ఉంటారు. భగవంతుడుకి మరో రూపంలో ఉన్న గురువును ఈరోజు స్మరించుకుంటే ‘నిన్ను నీవు తెలుసుకుంటావు’ అన్న రమణమహర్షి మాటలను స్మరించుకుంటూ గురువులను ఈరోజు పూజించుకుందాం.. 


THE IMPORTANCE OF GURUPURNIMA!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సాహో నెగిటివ్ టాక్ కట్టడి విషయంలో ప్రభాస్ సరికొత్త వ్యూహాలు !
విజయ్ దేవరకొండను కన్ఫ్యూజ్ చేస్తున్న పూరి చిక్కుముడి !
సాహో ను  కలవర పెడుతున్న త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌ టార్గెట్ !
 బాలకృష్ణకు ఇండస్ట్రీలో జరిగిన అన్యాయాన్ని బయపెట్టిన అల్లుడు భరత్ !
సాహో తో పోటీ పడుతూ సైరా కొని తెచ్చుకుంటున్న కష్టాలు !
తన తల్లి మనసులో ఉన్న కోపాన్ని బయటపెట్టిన ప్రభాస్ !
అమెరికా అధ్యక్షుడుతో పోల్చుకున్న అల్లు అర్జున్ !
అఖిల్ సమస్యలతో లాభ పడ్డ పూజా హెగ్డే !
రాజమౌళికి గురుదక్షిణ సమర్పించుకున్న ఏకలవ్యుడు !
ఆర్ధిక బాధలలో సంపూర్ణేష్ !
బాలీవుడ్ గాసిప్స్ వలయంలో చరణ్ !
షాకింగ్ పూరీ ఫ్యామిలీ ప్రమోషన్ వెనుక ఎత్తుగడ !
చిరంజీవి కార్యక్రమానికి రాజకీయ గ్రహణం !
సాహో ను కలవరపెడుతున్న బెదిరింపులు !
శ్రీదేవి కోసం కృష్ణుడుగా మారిన వర్మ !
ఎయిర్ పోర్ట్ లో బాలకృష్ణ వింత ప్రవర్తన !
ఎపిక్ ధియేటర్ ను దూరం పెట్టిన ప్రభాస్ !
షాకింగ్ సైరా లో రామ్ చరణ్ పాత్ర తొలగింపు ?
హాట్ టాపిక్ గా మారిన అడవిశేషు అంతర్మధనం !
మహేష్ బన్నీలను కలవరపెడుతున్న ఆక్సిజన్ !
నెగిటివ్ వార్తల పై పవన్ తిరుగుబాటు జోష్ లో అభిమానులు !
సంపూర్ణేష్ పేరుతో ప్రభాస్ ను అన్నిరకాల కార్నర్ కన్నడ మీడియా !
సాహో సెన్సార్ రిపోర్ట్ లో టోటల్ కన్ఫ్యూజన్ !
పరుశురామ్ పట్టుదలతో బెంబేలు ఎత్తిపోతున్న సుకుమార్ !
ఫ్యామిలీ కి డెడ్ లైన్ గీసిన సమంత !
మెగా అభిమానుల దెబ్బకు మార్గాన్ని వెతుక్కున్న నాని !
‘రష్మీ వల్ల జీవితంలో నష్టపోయిన సుడిగాలి సుధీర్ !
అభిమానులను మోసం చేసిన రానా !
బ్రహ్మోత్సవం భయంలో సాహో !
సాహో దెబ్బతో రోడ్డెక్కిన 13 చిన్న సినిమాలు !
నకిలీ పవన్ కళ్యాణ్ పై ఆశక్తికర చర్చలు !
అనుష్కను పెళ్ళి చేసేసుకోమని సలహా ఇచ్చిన ప్రభాస్ !
అల్లు అర్జున్ వ్యూహాత్మక ట్విట్ లోని ఆంతర్యం !
సాహో ని వెంటాడుతున్న రాజమౌళి శాపం !
 మన్మధుడు 2 పాపాలను కడిగేసుకుంటున్న నాగార్జున !
ఆ ఎగ్రిమెంట్ లో ఇరుక్కుపోయిన విజయ్ దేవరకొండ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..