సాహో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.  ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  ఈ సమయంలో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ చాలా అవసరం. ప్రమోషన్స్ కు ఇవి ఉపయోగపడుతుంటాయి.  దీనికి సంబంధించిన ఓ కీలక అప్డేట్ బయటకు వచ్చింది.  


ఇందులో ఓ ఫైట్ సన్నివేశం ఉందట.  దాదాపు 8 నిమిషాలపాటు ఆ ఫైట్ ఉంటుంది.  అంటే అది లాంగ్ సీన్ అనే చెప్పాలి.  ఈ ఫైట్ కోసం ఏకంగా సాహో నిర్మాతలు రూ. 70 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట.  ఈ స్థాయిలో డబ్బు పెట్టి సీన్ తీశారు అది ఎంత భారీగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.  సినిమాకు అది కీలంగా మారే అవకాశం ఉండొచ్చు.  


ఇలాంటివి సినిమాలో చాలానే ఉన్నాయని, ప్రతి సీన్ చాల రిచ్ గా ఎప్పుడు చూడని విధంగా ఉంటుందని సాహో యూనిట్ ప్రచారం చేస్తున్నది.  ఫస్ట్ సింగ్ లోని పదాలు అర్ధం కాకపోయినా..పార్టీ సాంగ్ కావడంతో పెద్దగా పట్టించుకోలేదు.  మిగతా సింగిల్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.  


ఆడియో, ట్రైలర్ డేట్స్ ను కూడా త్వరగా ప్రకటిస్తే బాగుంటుంది.  ప్రభాస్ కు జోడిగా శ్రద్ధా కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఆగష్టు 15 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు పోటీగా బాలీవుడ్ లో మిషన్ మంగళ్, బట్లా హౌస్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.   


మరింత సమాచారం తెలుసుకోండి: