ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో పాటు నటసింహ నందమూరి బాలకృష్ణ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ లను ఒకే వేదిక మీద చూడబోతున్నాం. వీరు ముగ్గురు కలిసి ఒకే ప్రేమలోకి ఫోటోగా రాబోతున్న అంటే అవుననే తెలుస్తోంది. ఈ ఇద్దరు నటులు ఏపీ కొత్త సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోబోతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అసలు మేటర్ లోకి వెళితే తెలంగాణ నుంచి విడిపోయి నవ్యాంధ్ర ఏర్పడ్డాక చంద్రబాబు ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించింది.


చంద్రబాబు ప్రభుత్వం 2014 - 2015 - 2016 సంవ‌త్స‌రాల‌కు అవార్డులు ప్ర‌క‌టించినా ఇప్పటివరకు ఈ పురస్కార గ్రహీతలు వాటిని అందుకోలేదు. అప్పట్లో నంది అవార్డుల ఎంపిక పై విమర్శలు కూడా వచ్చాయి. బాల‌య్య‌, మహేష్ బాబు సినిమాలకు అవార్డులు రావడంతో కేవలం కమ్మ సామాజిక వర్గానికి గంపగుత్తగా ఈ అవార్డులు కట్టబెట్టారని ప్రచారం కూడా జరిగింది. ఇక చంద్రబాబు ఈ మూడు సంవత్సరాల అవార్డు గ్ర‌హీత‌ల‌కు ఒకే వేదిక మీద ఇవ్వాలని అనుకున్న కుదరలేదు.


ఇప్పుడు ప్రభుత్వం మారింది. వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సీఎం అయ్యారు. పెండింగ్లో ఉన్న అవార్డులు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. 2014 ఏడాదికి ఉత్తమ నటుడిగా బాలయ్య (లెజెండ్).. 2015 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా మహేష్ (శ్రీమంతుడు).. 2016 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్) పురస్కారాల్ని అందుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఈ అవార్డులు అందుకునే క్ర‌మంలోనే జ‌గ‌న్‌, ఎన్టీఆర్‌, బాల‌య్య ఒకే వేదిక మీద క‌న‌పించ‌నున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: