ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సెంటిమెంట్లు జరుగుతూ ఉంటాయి. కొన్ని సెంటిమెంట్లు మనం కావాలని ఫాలో అయితే కొన్ని మాత్రం యాదృచ్చికంగా జరుగుతాయి. రామ్ చరణ్ ఫ్లాప్ అయిన సినిమాలకు కూడా ఇలాంటి సెంటిమెంట్ కథ ఒకటి ఉంది. చిరుత సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టిన రామ్ చరణ్. తొలి సినిమా అబవ్ యావరేజ్ అనిపించుకుంది.ఆ తరువాత చరణ్ నటించిన మగధీర సినిమా ఇండస్ట్రీ హిట్టైంది.

 

కానీ రామ్ చరణ్ నటించిన 3వ సినిమా ఆరెంజ్ మాత్రం డిజాస్టర్ అనిపించుకుంది. ఆ తరువాత చరణ్ నటించిన రచ్చ, నాయక్ హిట్ కాగా ఆరవ సినిమా తుఫాన్ మాత్రం డిజాస్టర్ అయింది. మరలా ఎవడు సినిమాతో చరణ్ హిట్ కాగా గోవిందుడు అందరివాడేలే సినిమా యావరేజ్ అనిపించుకుంది. కానీ చరణ్ 9 వ సినిమా బ్రూస్ లీ కూడా డిజాస్టర్ అయింది. చరణ్ నటించిన ధృవ్, రంగస్థలం సినిమాలు హిట్ కాగా 12వ సినిమా వినయ విధేయ రామ ఫ్లాప్ అయింది.

 

ఇలా రామ్ చరణ్ కెరీర్లో హీరోగా నటించిన 3,6,9,12 సినిమాలు మాత్రమే డిజాస్టర్ అయ్యాయి. మిగతా సినిమాలు మాత్రం హిట్ అయ్యాయి. రెండు సినిమాలు హిట్లు అవుతుంటే మూడో సినిమా మాత్రం ఫ్లాప్ అవుతుంది. రామ్ చరణ్ తన తరువాత సినిమాలలోనైనా ఈ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.(ఖైదీ నంబర్ 150 సినిమాలో చరణ్ గెస్ట్ అప్పియరెన్స్ మాత్రమే కాబట్టి ఆ సినిమాను ఇక్కడ పరిగణనలోకి తీసుకోలేదు.)



మరింత సమాచారం తెలుసుకోండి: