సినిమాల్లో చెప్పిన డైలాగులు రియల్ లైఫ్ లో నిజం అవుతుంటే ఎలా ఉంటుంది.  అరె ఈ ఐడియా ఏదో బాగుందే.. మంచి కథ రాసుకోవచ్చు.  సినిమా కథగా మారిస్తే మైథలాజికల్ సినిమా అవుతుంది.  ఇది వేరే విషయం అనుకోండి. బాలకృష్ణ ఒక్కమగాడు సినిమాలో కొన్ని డైలాగులు ఉన్నాయి.  చాలా సీరియస్ గా ఉండే డైలాగులు.  ఇంగ్లాండ్ గురించి, క్రికెట్ గురించి, వరల్డ్ కప్ గురించి మాట్లాడతారు.  


ఓ సన్నివేశంలో నువ్వు ఏ దేశానికీ చెందిన వాడవు అని నటుడిని బాలయ్య అడుగుతాడు. ఇంగ్లాండ్ అని చెప్తాడు.  క్రికెట్ ఏ దేశంలో పుట్టింది అని బాలయ్య అడిగితె.. అదికూడా తెలియదా మాదేశంలో అని సమాధానం ఇస్తాడు.  ఇంగ్లాండ్ ఒక్కసారైనా వరల్డ్ కప్ గెలిచిందా అని ప్రశ్నిస్తాడు. 


ఇది జస్ట్ సినిమాలోని చిన్న సన్నివేశమే కానీ, ఇంగ్లాండ్ వరల్డ్ కప్ గెలిచిన తరువాత ఈ సీన్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నది.  బాలకృష్ణ మాటలను ఇంగ్లాండ్ సీరియస్ గా తీసుకుందని అందుకే ఇంగ్లాండ్ విజయం సాధించని సరదగా మాట్లాడుకుంటున్నారు.    


2019 కి ముందు వరకు ఇంగ్లాండ్ కు ఒక్క వరల్డ్ కప్ కూడా రాలేదు.  27 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్ వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది.  అప్పుడు ఓటమి పాలైంది.  2019 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది.  ఎలాగైతేనేం  ఈ 2019 వరల్డ్ కప్ ను ఇంగ్లాండ్ సొంతం చేసుకుంది.  ఈసారి వరల్డ్ కప్ గెలుచుకున్న ఇంగ్లాండ్ దేశంలో 7 మంది ఆటగాళ్లు వలస వచ్చి ఇంగ్లాండ్ లో సెటిలైన వ్యక్తులు ఉండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: