మున్నా సినిమాతో దర్శకునిగా కెరీర్ స్టార్ట్ చేసాడు వంశీ పైడిపల్లి. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో మరలా సినిమా అవకాశం రావడానికి మూడేళ్ళ సమయం పట్టింది. మున్నా తరువాత ఎన్టీయార్ తో తీసిన బృందావనం హిట్టైనా మూడేళ్ళ గ్యాప్ తీసుకుని ఎవడు సినిమా తీసాడు వంశీ పైడిపల్లి. ఎవడు తరువాత రెండేళ్ళ గ్యాప్ లో ఊపిరి మూడేళ్ళ గ్యాప్ తో మహర్షి సినిమా తీసాడు వంశీ పైడిపల్లి. 
 
ఇలా వంశీ పైడిపల్లి 13 ఏళ్ళ సినిమా కెరీర్లో కేవలం 5 సినిమాలు మాత్రమే తీసాడు. ఇలా వంశీ కెరీర్లో ఇంతలా గ్యాప్ రావటానికి కారణం ఏమిటంటే వంశీ పైడిపల్లి సినిమాలు కేవలం స్టార్ హీరోలతో మాత్రమే తీయాలని నిర్ణయించుకోవడం. వంశీ పైడిపల్లి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు స్టార్ హీరోలతో సినిమాలు తీయడమే సౌకర్యంగా ఉంటుందని స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు తీస్తానని చెప్పుకొచ్చాడు. 
 
కానీ స్టార్ హీరోలతో సినిమా తీయాలంటే అంత సాధారణమైన విషయం కాదు. కథ స్టార్ హీరోలకి నచ్చినా ఆ హీరోలు ముందుగానే ఓకె చెప్పిన సినిమాలు అన్నీ పూర్తి చేసేదాకా దర్శకులు ఎదురు చూడక తప్పదు. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోలు సినిమా కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు. మరి స్టార్ హీరోలతోనే సినిమాలు తీస్తానన్న వంశీ పైడిపల్లి తన తరువాత సినిమా కోసం ఇంకెన్ని సంవత్సరాలు ఎదురు చూస్తాడో. 



మరింత సమాచారం తెలుసుకోండి: