టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ కి ఆకాశమే హద్దు. ఆయన ఫ్యాన్స్ తమ అభిమానాన్ని “పవనిజం” అని పేరు పెట్టుకుని పవన్ స్టామినాని తెలియజేసారు. మెగాస్టార్ చిరంజీవి తరువాత ఆయన తమ్ముడికే అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కడం నిజంగా యాదృచ్ఛికమే. 1996లో చిరంజీవి తమ్ముడిగా తెరంగేట్రం చేసిన ఆయన, నాలుగో సినిమా తొలిప్రేమతో స్టార్ స్టేటస్ వస్తే.. తన అయిదో సినిమా తమ్ముడు తో మాస్ ఇమేజ్ సొంతమైంది.

 

 

ఇరవై ఏళ్ల క్రితం  (15-7-1999) తేదీన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తమ్ముడు రిలీజ్ అయింది. ఫస్ట్ షోతోనే యునానిమస్ హిట్ టాక్ సొంతం చేసుకున్న పవన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ గా నిలిచింది. పవన్ ఈ సినిమాలో స్టూడెంట్ గా, అల్లరి కుర్రాడిలా, బాధ్యత గల కొడుకుగా, స్పోర్ట్స్ పర్సన్ గా, చాంపియన్ గా.. ఇలా అనేక కోణాలున్న పాత్రను ఈ ఒక్క సినిమాలోనే చేశాడు. పాటలు యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ ఈ సినిమా ఆడియో ఎవర్ గ్రీన్ గానే ఉండటం విశేషం. రమణ గోగుల సంగీతం సంగీత ప్రియుల్ని అలరించాయి. “Look at my face in the mirror” అనే పాట అప్పట్లో యువతరాన్ని ఓ ఊపు ఊపేసింది. ఆ పాటలో పవన్ చేసిన తైక్వాండో ఆర్ట్, పవన్ ఓన్ స్టైల్ స్కిల్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. 1992లో హిందీలో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన జో జీతా వహీ సిఖిందర్ సినిమా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. హిందీలో సైకిల్ రేస్ ను మెయిన్ ప్లాట్ గా తీసుకుంటే తెలుగులో కిక్ బాక్సింగ్ ను తీసుకున్నారు. ఈ ప్లాట్ ఆడియన్స్ ను, ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది.

 

 

ఈ సినిమా 22 సెంటర్లలో డైరెక్ట్ గా 100 రోజులు ప్రదర్శితమైంది. విజయవాడ యువరాజ్ ధియేటర్ లో 175 రోజులు డైరెక్ట్ గా రన్ అయింది. తమిళ్ లో ఈ సినిమాను బద్రి, కన్నడలో యువరాజా, బెంగాలీలో చాంపియన్ గా రీమేక్ అయింది. ఆ టైమ్ లో పవన్ కెరీర్ పీక్స్ లో ఉంది. మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి ఖుషీ వరకు వరుసగా ఏడు సినిమాలు ఒకదానిని మించి మరొకటి హిట్ అయ్యాయి. దీంతో పవన్ కల్యాణ్ యూత్ ఐకాన్ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: