తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా ఇతర భాషా చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రాఫర్ గా ఉన్న సుందరం మాస్టారు అంటే అప్పట్లో ఎంతో క్రేజ్ ఉంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో పాటు ఎంజీఆర్ తో కూడా ఆయన స్టెప్పులు వేయించారు.  ఆయన తనయులు రాజు సుందరం, ప్రభుదేవ లు కూడా తండ్రి బాటలోనే వెళ్లారు మంచి కొరియోగ్రాఫర్లుగా నిలిచారు. 

ఇక ప్రభుదేవ అయితే నటుడు,దర్శకుడిగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తన సత్తా చాటతున్నారు.  తాజా ఇంటర్వ్యూలో సుందరం మాస్టర్ మాట్లాడుతూ.. తాను డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా ఉన్నపుడు తన తనయులు డ్యాన్స్ పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించారని..వారిని కూడా తను ఆ దిశగానే ఎంకరేజ్ చేశానని అన్నారు. చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఎన్నో కష్టాలను ఎదుర్కుంటూ కొరియోగ్రఫీ వైపు వచ్చాను.

అప్పట్లో డ్యాన్స్ మాస్టార్లు తమ పిల్లలను ఇండస్ట్రీ వైపు రానిచ్చేవారి కాదని..కానీ నేను మాత్రం తన ముగ్గురు కొడుకులకు డాన్స్ నేర్పించి కొరియోగ్రఫర్స్ గా చేశాను.  నా ముగ్గరు కొడుకుల్లో ప్రభుదేవ చాలా ప్రత్యేకం అని డ్యాన్స్ లో ఎన్నో ప్రయోగాలు చేసేవాడని అందుకే ఈ స్థాయికి చేరుకున్నాడని అన్నారు.  ప్రభుదేవ గురించి అందరూ మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంటుందని..అతడు కొరియోగ్రాఫిలో ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేశాడని అన్నారు. 


లుగు . తమిళ భాషల్లో డాన్స్ మాస్టర్ గా సుందరం మాస్టర్ కి ఎంతో క్రేజ్ వుంది. ఆయన ముగ్గురు తనయుల్లో ప్రభుదేవా .. రాజు సుందరం కొరియోగ్రఫర్స్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో సుందరం మాస్టర్ మాట్లాడుతూ .. " చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఎన్నో కష్టాలను ఎదుర్కుంటూ కొరియోగ్రఫీ వైపు వచ్చాను. అందుకే నా ప్రభుదేవకు హ్యాట్సాఫ్ చెబుతున్నాను అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: