బాలీవుడ్ బిగ్ బి అమితాబ‌చ్చ‌న్ ఆదివారం లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టైగా ముగియగా.. ఫలితం తేల్చడం కోసం సూపర్ ఓవర్ నిర్వహిస్తే అది కూడా టైగానే ముగిసిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎక్కువ బౌండ్రీలు కొట్టిన కారణంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. ఈ విచిత్ర నిబంధ‌న‌పై ఇప్పటికే క్రీడా విశ్లేష‌కులు, అభిమానుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు మండిప‌డుతున్నారు.

తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఐసీసీకి అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. బిగ్‌ బి దీనిపై స్పందిస్తూ..మీ ద‌గ్గ‌ర రెండు వేల రూపాయ‌లు ఉంటే, నా ద‌గ్గ‌ర 2000 రూపాయ‌లు ఉన్నాయి. మీ ద‌గ్గ‌ర రెండు వేల రూపాయ‌ల నోటు ఒక‌టి ఉంటే, నా ద‌గ్గ‌ర 500 రూపాయ‌ల నోట్లు నాలుగు ఉన్నాయి. మ‌రి ఎవ‌రు ధ‌న‌వంతులు అంటే ??? ఐదు వంద‌ల నోట్లు నాలుగు ఉన్నోడే గొప్పోడు అని ఐసీసీ అంటుంద‌ని మెగాస్టార్ కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

అమితాబ్ బచ్చన్.. పేరెత్తకుండా ఇండియన్ సినిమా గురించి చెప్పడం సాధ్యం కాదు. బాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన... లెక్కలేనన్ని సినిమాలు అమితాబ్ లిస్ట్‌లో ఉన్నాయి. అమితాబచ్చన్‌తో భారతీయుల అనుబంధం ఈనాటిదికాదు. 1969 ఫిబ్రవరి 15నే రిలీజైంది. అప్పటి నుంచి మొదలైన నట ప్రస్థానం ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.

సామాజిక అనుసంధాన వేదికల్లో నేటితరం కథానాయకులెవరూ అమితాబ్‌కు సాటిరారు. అంతలా మిలియన్ల కొద్దీ అభిమానులున్నారు బిగ్‌బీకు. నిత్యం తన అభిమానులతో ఎన్నో విషయాలు పంచుకొంటూ వయసు శరీరానికే కానీ మనసుకుకాదని నిరూపిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: