భారతీయ చలన చిత్ర రంగంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన స్టార్ దర్శకులు శంకర్ ‘రోబో 2.0’ తర్వాత విశ్వనటుడు కమల్ హాసన్ తో భారతీయుడు సీక్వెల్ భారతీయుడు 2 సినిమాకు రంగం సిద్దం చేశారు.  ఈ మూవీ మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి.  మొదటిసారి ఈ స్టార్ డైరెక్టర్ షూటింగ్ మొదటి దశలోనే ప్రొడక్షన్ సంస్థతో విబేధాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.  ఆ తర్వాత కమల్ హాసన్ మేకప్ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. 

ఇవన్నీ సెట్ అయ్యాక తమిళనాడులో ఎన్నికలు రావడం..కమల్ హాసన్ పోటీలో పాల్గొనడంతో మరికొంత కాలం సినిమా వాయిదా వేశారు.  ఒకదశలో ఈ సినిమా ఉంటుందా లేదా అనుమానాలు కూడా వచ్చాయి..కానీ అప్పుడప్పుడు ఈ మూవీ గురించి అప్ డేట్ చేస్తున్నారు దర్శకులు శంకర్.  ప్రస్తుతం సినిమా నిర్మాతలతో శంకర్ గ్యాప్ లేకుండా చర్చలు జరుపుతున్నాడు. 2.0 సినిమాతో కాస్త దెబ్బతిన్న లైకా ప్రొడక్షన్స్ ఇండియన్ 2 విషయంలో మళ్ళీ అత్యధిక బడ్జెట్ పెట్టడం తమ వల్ల కాదని తేల్చేశారు. 

మొదట కాస్త బెట్టు చేసినా శంకర్ ఇప్పుడు మెట్టు దిగినట్లు తెలుస్తుంది. లైకా ఇచ్చిన బడ్జెట్ లోనే సినిమాను తెరకెక్కించేందుకు శంకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.  అయితే ఈ విషయంలో మాత్రం హీరో కమల్ హాసన్ కాస్త నిరుత్సాహంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కమల్ తమిళంలో వస్తున్న బిగ్ బాస్ 3 కి హూస్ట్ గా వ్యహరిస్తున్న విషయం తెలిసిందే.  ఆగస్ట్ చివరి వారంలో శంకర్ ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ వేగాన్ని పెంచనున్నట్లు కోలీవుడ్ టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: