టాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా కొత్త హీరోలు తమ టాలెంట్ తో సినీ రంగంలోకి అడుగు పెడుతున్నారు. అలాంటి వారిలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఒకరు.  మొదటి సినిమా ‘హృదయకాలేయం’ రిలీజ్ కి ముందే ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ తర్వాత కూడా ఈ సినిమా ఏంటో అని కొందరు..కడుపుబ్బా నవ్వుకుంటూ మరికొందరు మొత్తానికి ఎతో హిట్ టాక్ వచ్చేలా చేశారు.  ‘సింగం 123’ తర్వాత కొన్ని సినిమాల్లో స‌పోర్టింగ్ రోల్స్ చేసిన సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం ‘కొబ్బరి మట్ట’ మూవీతో అభిమానుల ముందుకు మరోసారి రాబోతున్నారు. 

వాస్తవానికి ఈ మూవీ 2015లో మొద‌లైన జూలై 19న విడుద‌ల కానుంద‌ని ఆ మద్య మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాని మ‌ళ్ళీ ఆ డేట్ మారుస్తూ ఆగ‌స్ట్ 2న సినిమా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు అనౌన్స్ చేశారు. ఇలా ఎన్నో వాయిదాలు పడుతూ వస్తుంది  ఈ మూవీ. ఇక తాజాగా ఈ మూవీ  నుండి అ..ఆ , ఇ..ఈ అంటూ సాగే పాట‌కి సంబంధించిన ప్రోమో విడుద‌ల చేశారు. ఈ పాట మొత్తం తెలుగు అక్ష‌ర‌మాల‌తోనే ఉండ‌గా ఇందులో సంపూర్ణేష్ స్టెప్స్ అభిమానుల‌కి మంచి వినోదాన్ని క‌లిగిస్తున్నాయి. 

హృదయ కాలేయం టీం నుండి వస్తున్న ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. ఆ మద్య రెండు సాంగ్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి సంపూ ‘కొబ్బరిమట్ట’తో హిట్ కొడతాడా లేదా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: