సినిమా రంగంలోకి వచ్చి అద్భుతాలు సృష్టించాలని చాలామంది అనుకుంటారు. కానీ, ఆ అవకాశం కొందరికే వస్తుంది. ఆ కొందరిలో ఎంతమంది సక్సెస్ అవుతారు అన్నది వేరే విషయం. అవకాశం కోసం మాత్రం ట్రై చేస్తూనే ఉంటారు. కృష్ణ నగర్ లో ఇవన్నీ షరా మామూలే.
రంగుల ప్రపంచాన్ని ఏలాలని ఎన్నో కలలు కంటుంటారు. ఆ కలల్ని కొందరే సాకారం చేసుకుంటుంటారు. అలాంటి కొందరే విజేతలుగా నిలుస్తారు. మార్గదర్శకులు అవుతారు. అందుకే అన్నారు కృషి ఉంటె మనుషులు ఋషులౌతారు అని.
ఈ ఉపోద్గాతం అంతా దేనికోసం అని ఆశ్చర్యపోకండి.. మన దర్శకులు అప్పుడప్పుడు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇందులో ఉన్నది ఎవరో చెప్పుకోండి చూద్దాం అని దాగుడు మూతలు ఆడుతుంటారు. అలాగే టాప్ దర్శకుడు ఓ ఫోటోను షేర్ చేశారు. చిన్నప్పటి ఫోటో అది. గళ్ళ చొక్కా.. గళ్ళ ప్యాంట్ వేసుకున్నాడు.
మొహంలో అమాయకత్వం కనిపిస్తోంది. చిన్నప్పుడు అంత అమాయకంగా ఉన్న ఆ పిల్లవాడు .. ఇప్పుడు నా సినిమా నాఇష్టం అనే రీతికి ఎదిగిపోయాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూస పద్దతికి స్వస్తి పలికిన దర్శకుడు ఆయన. ఇప్పటికైనా అర్ధం అయిందనుకుంటా ఆ ఫొటోలో ఉన్నది ఎవరో. ఏంటి అలా చూస్తున్నారు. ఇంకా అర్ధం కాలేదా.. రామ్ గోపాల్ వర్మ. అప్పుడు ఎంత అమాయకంగా ఉన్నారో చూశారు కదా. అదే ఇప్పుడు చూస్తే.. షాక్ అవుతారు.