సినిమా రంగంలోకి వచ్చి అద్భుతాలు సృష్టించాలని చాలామంది అనుకుంటారు.  కానీ, ఆ అవకాశం కొందరికే వస్తుంది.  ఆ కొందరిలో ఎంతమంది సక్సెస్ అవుతారు అన్నది వేరే విషయం.  అవకాశం కోసం మాత్రం ట్రై చేస్తూనే ఉంటారు.  కృష్ణ నగర్ లో ఇవన్నీ షరా మామూలే.  


రంగుల ప్రపంచాన్ని ఏలాలని ఎన్నో కలలు కంటుంటారు.  ఆ కలల్ని కొందరే సాకారం చేసుకుంటుంటారు.  అలాంటి కొందరే విజేతలుగా నిలుస్తారు.  మార్గదర్శకులు అవుతారు.  అందుకే అన్నారు కృషి ఉంటె మనుషులు ఋషులౌతారు అని.  


ఈ ఉపోద్గాతం అంతా దేనికోసం అని ఆశ్చర్యపోకండి.. మన దర్శకులు అప్పుడప్పుడు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇందులో ఉన్నది ఎవరో చెప్పుకోండి చూద్దాం అని దాగుడు మూతలు ఆడుతుంటారు.  అలాగే టాప్ దర్శకుడు ఓ ఫోటోను షేర్ చేశారు.  చిన్నప్పటి ఫోటో అది.  గళ్ళ చొక్కా.. గళ్ళ ప్యాంట్ వేసుకున్నాడు.  


మొహంలో అమాయకత్వం కనిపిస్తోంది.  చిన్నప్పుడు అంత అమాయకంగా ఉన్న ఆ పిల్లవాడు .. ఇప్పుడు నా సినిమా నాఇష్టం అనే రీతికి ఎదిగిపోయాడు.  తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూస పద్దతికి స్వస్తి పలికిన దర్శకుడు ఆయన.  ఇప్పటికైనా అర్ధం అయిందనుకుంటా ఆ ఫొటోలో ఉన్నది ఎవరో.  ఏంటి అలా చూస్తున్నారు.  ఇంకా అర్ధం కాలేదా.. రామ్ గోపాల్ వర్మ. అప్పుడు ఎంత అమాయకంగా ఉన్నారో చూశారు కదా.  అదే ఇప్పుడు చూస్తే.. షాక్ అవుతారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: