సాంకేతిక రంగం అభివృద్ధి చెందిన తరువాత ల్యాండ్ ఫోన్ నుంచి సెల్ ఫోన్ చేతికి వచ్చింది.  సెల్ ఫోన్ లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.  ఈ మార్పులు మామూలు మార్పులు కాదు.  ఆండ్రాయిడ్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటున్నది.  ఇక యాప్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.  


ఇంకేముంది.. తమ బుర్రలకు పదును పెట్టి రకరకాల యాప్ లు క్రియేట్ చేస్తున్నారు.  ఈ యాప్ లతో డబ్బులు సంపాదిస్తున్నారు.  లక్ ఉంటె యాప్ సూపర్ హిట్ అవుతుంది.  కోట్లాది డబ్బు సొంతం అవుతుంది.  ఈ విధంగా తయారైంది టిక్ టాక్ గేమ్.  


యూజర్ ఫ్రెండ్లీగా తయారైన ఈ టిక్ టాక్ కు కోట్లాదిమంది అడిక్ట్ అవుతున్నారు.  చదువును పక్కన పెట్టి విద్యార్థులు టిక్ టాక్ గేమ్ షోలు చేస్తూ బిజీ అవుతున్నారు.  కొంతమంది ఉద్యోగులు టిక్ టాక్ లు చూసుకుంటూ కూర్చుంటున్నారు.  చూసుకుంటూ కూర్చుంటే సరే... 


ఓ అడుగు ముందుకు వేసి.. టిక్ టాక్ చేస్తున్నారు.  ఉద్యోగాలను పక్కన పెట్టి టిక్ టాక్ చేస్తున్న ఖమ్మం మున్సిపల్ ఉద్యోగులపై మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  టిక్ టాక్ చేసిన మీడియా ద్వారా బయటకు రావడంతో... 9 మంది ఉగ్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.  ఇప్పటికే టిక్ టాక్ షోను బ్యాన్ చేయాలని డిమాండ్ వస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: