ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రం సాహు. యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'రన్ రాజా రన్' దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఆగష్ట్ 15న విడుదల చేస్తామని ఇప్పటికే సాహూ చిత్ర యూనిట్ ప్రకటించేసింది.


దీంతో అంతటి భారీ చిత్రం విడుదల తేదీ ఖరారు కావడంతో చిన్న చిన్న సినిమాలు అన్ని వారి సినిమాల విడుదల తేదీలను వాయిదా వేసుకొని కొంచం ఊపిరి పీల్చుకున్నరు. కానీ ఉన్నట్టుండి సాహూ విడుదల వాయిదా అని బాంబు పేల్చింది సాహూ చిత్ర యూనిట్. దీంతో కొంతమంది సినీ స్టార్స్ ఆనందపడగా మరికొందరు సినీ స్టార్స్ షాక్ కి గురయ్యారు.     


సాహూ చిత్రం ఆగష్టు 30వ తేదికి వాయిదా పడింది. సాహూ వాయిదా పడటం వాళ్ళ శర్వానంద్ హ్యాపీ అయితే నాని షాక్ కు గురయ్యారు. కారణం నాని గ్యాంగ్ స్టార్ ఆగష్టు 30వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఆగష్టు 2న విడుదల అవ్వాల్సిన రణరంగం ఆగష్టు 15 కు వాయిదా వేసుకుంది. 'సాహూ'తో రణరంగం పోటీ పడుతుందా అనుకున్నవారు పోటీ అవసరం లేదు ఏకపక్షంగా హిట్ అవుతుంది అని అంటున్నారు రణరంగం చిత్ర యూనిట్. కానీ సాహూ వాళ్ళ నాని గ్యాంగ్ స్టార్ మాత్రం చిక్కుల్లో పడనుంది. చూద్దాం సాహూ కు బయపడి ఆగష్టు 15 విడుదల చేస్తారా ? లేక సెప్టెంబ‌ర్ లో విడుదల చేస్తారా ? 'సాహూ'తో గ్యాంగ్ స్టార్ పోటీ పడుతుందా అనేది చూడాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: