హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించే మన సౌత్ సినిమాలలో భారీగా నిర్మించే సినిమాల వ్యవహారాలు వేరుగా వుంటాయి. బాహుబలి తీస్తే ఈ సినిమాకోసం రాజమౌళి కత్తులు, ఈటెలు వంటి ఆయుధాల ఫ్యాక్టరీ పెట్టాల్సి వచ్చింది. అలాగే ఇప్పుడు ప్రభాస్ సాహో సంగతి కూడా ఇలానే ఉంది. సాహో.. అల్ట్రా మోడరన్ జేమ్స్ బాండ్ సినిమా. ఛేజింగ్ లు, యాక్షన్ సీన్లు, అంతా అదో లెవెల్ లో ఉన్నాయి.

అందుకే సాహో సినిమా కోసం కార్లు విపరీతంగా వాడాల్సి వచ్చిందట. ముఖ్యంగా దుబాయ్ లో తీసిన ఛేజింగ్ సీన్ ఈ సినిమాలో ఎంతో ప్రత్యేకమైనది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, సాహో సినిమా కోసం చాలా కార్లు కొనాల్సి వచ్చిందని తెలుస్తోంది. సినిమా మొత్తానికి 120 కార్లు వాడారట. ఒక్క దుబాయ్ ఛేజింగ్ ఎపిసోడ్ లోనే 56 కార్ల వరకు వాడారని లేటెస్ట్ న్యూస్. ఈ సీన్ కోసం ఓ ప్రత్యేకమైన ట్రక్ ను స్వయంగా తయారు చేయించారని సమాచారం.

అంతేకాదు మరో యాక్షన్ సీన్ లో 18 కార్లు వాడారట. ఇదికాక సినిమాలోని మరికొన్ని సీన్లు అన్నీకలిపి 46 కార్లు వాడారని తెలుస్తోంది. సాహో సినిమాకు ముంబాయి, విదేశీ నిపుణులు పనిచేసారు. వీరి ఫీజులు, పారితోషికం అంతా కోట్లలోనే ఉందని తెలుస్తోంది. ఇక ఆగస్టు 15న విడుదలకు సిద్దమవుతున్న సాహో సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించగా వంశీ, ప్రమోద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: