మెగాస్టార్ చిరంజీవి మెగా మూవీ సైరా దసరా సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. అక్టోబర్ 2 డేట్ అనేది ఇంకా పక్కా కాదని సమాచారం. టాలీవుడ్ లో ఈ సినిమా గురించి చూసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అంత భారీ సినిమా వస్తుంటే మరే సినిమా కూడా పోటీకి వచ్చే అవకాశమే లేదు. కానీ అసలు   సమస్య బాలీవుడ్‌లోనే వస్తోంది.

సైరా సినిమాను బాలీవుడ్ లో కూడా భారీగా విడుదల చేయాలన్నది చిత్ర బృందం మాస్టర్ ప్లాన్. పైగా ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ కూడా వున్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో సైరాకు గట్టిపోటీ తగిలేలా వుందని లేటెస్ట్ న్యూస్. హృతిక్ రోషన్ వార్ సినిమా కూడా అక్టోబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్ లో చిత్ర బృందం ఉందని బాలీవుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం. రీసెంట్‌గా ఆ సినిమా టీజర్ కూడా వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. హృతిక్ సినిమా స్టాండర్డ్ చూస్తుంటే చాలా హై లెవెల్ లో సినిమాను తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. భారీతనం మాత్రమే కాకుండా, యాక్షన్ సీన్లు, ఛేజింగ్ లు ఇలా ప్రతి ఒక్కటీ చాలా ఆసక్తికరంగా వున్నాయి.

ఇప్పుడు ఇలాంటి సినిమాతో సైరా సినిమా బాలీవుడ్ లో పోటీ పడాలి. ప్రస్తుతానికి ఈ ఒక్క సినిమా మాత్రమే పోటీ కనిపిస్తోంది. మరి బరిలో ఇంకేం సినిమాలు రంగంలోకి దిగుతాయో చూడాలి. మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 తర్వాత ఎంతో భారీ తనంతో తెరకెక్కించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానిర్ పై రాం చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: