నాకోసమే డియర్ కామ్రేడ్ సినిమాలో నటించడానికి రష్మిక ఒప్పుకోలేదని క్లారిటీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. అంతేకాదు రష్మిక పేరును కూడా నేను స్పెషల్ గా రికమెండ్ చేయలేదని చెప్పాడు. ఇక తన సినిమాలో హీరోయిన్ ని నేను ఫైనల్ చేయనని స్పష్టం చేశాడు. "ఫ్రెండ్స్ గురించి సినిమాలు చేయడం, ఈ హీరోయిన్ తోనే సినిమా చేయమని డిమాండ్ చేయడం లాంటివి జరగవు.  దర్శకుడితో పాటు అతడు చెప్పే స్క్రిప్ట్ నాకు నచ్చితే నేను సినిమా చేస్తాను. ఇంకేవీ పట్టించుకోను. నా సినిమాల్లో హీరోయిన్, ఆ పాత్రకు ఫిట్ అవ్వాలి. ఆ హీరోయిన్ దర్శకుడికి నచ్చాలి. నేను అంతవరకే చూస్తాను..అన్నాడు."

గీతగోవిందం తర్వాత వెంటనే విజయ్-రష్మిక కలిసి ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందరికీ ఇలాంటి అనుమానాలొచ్చాయి. విజయ్ దేవరకొండ కావాలనే రష్మికను ప్రమోట్ చేస్తున్నాడంటూ పుకార్లు కూడా పుట్టాయి. పైగా సాయిపల్లవిని తప్పించి మరీ రష్మికకు ఈ ఛాన్స్ ఇచ్చారంటూ రాశారు. దీనిపైనా క్లారిటి ఇచ్చాడు.
వాస్తవంగా "డియర్ కామ్రేడ్ లో హీరోయిన్ పాత్ర కోసం ఇద్దర్ని మాత్రమే అనుకున్నాం. సాయిపల్లవి, రష్మిక మాత్రమే ఫిట్ అవుతారని అనిపించింది. వాళ్లిద్దరూ డియర్ కామ్రేడ్ స్క్రిప్ట్ విన్నారు. ఇద్దరికీ బాగా నచ్చింది. రష్మిక వెంటనే సినిమా ఒప్పుకుంది. అలా డియర్ కామ్రేడ్ లో భాగమైంది.. చెప్పాడు"

అందుకే ఈ సినిమా టీజర్, ట్రయిలర్ రిలీజైన తర్వాత ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇక తనకు లిప్ లాక్ అనే పదం తనకు నచ్చదని, దాన్ని కూడా ఓ ఎమోషన్ గానే చూడాలని అన్నాడు విజయ్.  ఇక ఈ సినిమా కొన్ని సీన్స్ పక్కాగా రావడానికే రీ షూట్ చేశామని అందులో వేరే ఆలోచించడానికి ఏం లేదని చెప్పాడు. ఈ సినిమాల తర్వాత మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్న విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: