సందీప్ కిషన్ చేసింది 20 సినిమాలు. పాపం దాదాపు చాలా సినిమాలు ఫ్లాపయ్యాయి. అందుకే 15 సినిమాల దాకా నిర్మాతలు డబ్బులివ్వకుండా మొహం చాటేశారు. ఆ తర్వాత అవకాశాలు అంతగా కనిపించలేదు. నీడలా వెంటాడుతున్న తన బ్యాడ్ లక్ ని వదిలించుకోవడానికి తనే నిర్మాతగా మారాడు. అదే నిను వీడని నీడను నేనే. ఒకటి, రెండు కాదు..దాదాపు 6-7 కోట్లు ఖర్చుచేసి సినిమా చేసాడు. పబ్లిసిటీకి కూడా సినిమాకు మించే ఖర్చు చేసారు. అయితే సినిమా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ రావడం అందరిని ఆశ్చర్యపరిచే విషయం. ఈ విషయంలో సందీప్ కూడా హ్యాపీగా ఉన్నాడు. తమిళ వెర్షన్ 2.50 కోట్లకు అమ్ముడవడం, ఆంధ్ర 1.90కి ఇచ్చేయడం, హిందీ డబ్బింగ్ ద్వారా 1.70 కోట్లు రావడం, మ్యూజిక్ రైట్స్ ద్వారా 20లక్షలు, అన్నింటికి మించి డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా మంచి మొత్తం రావడంతో టేబుల్ ప్రాఫిట్ వచేసింది. నైజాం, ఓవర్ సీస్ ఓన్ గా విడుదల చేసుకున్నారు.

ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే, ఆంధ్ర 1.90 వసూలు చేస్తే బయ్యర్లు కూడా సేఫ్ అవుతారు. విశాఖ 27 లక్షలకు ఇస్తే 27లక్షలు రావడం విశేషం. ఉత్తరాంధ్రలో మొదటి మూడురోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిన సందీప్ సినిమా ఇదే కావడం విశేషం. కృష్ణజిల్లా ఫస్ట్ వీకెండ్లో 17లక్షలకు పైగా వసూలు చేసింది, మరో ఎనిమిదిలక్షల వరకు రావాలి. ఇలా దాదాపు ఆంధ్ర ఏరియాలు అన్నీ దాని లెవెల్ కు స్టడీగానే వున్నాయి.

నైజాంలో ఓన్ గా రిలీజ్ చేసుకున్నారు, కోటిన్నర వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. అది లాభంగా వుండిపోతుంది. కానీ ఓవర్ సీస్ మాత్రం ఫ్లాప్ అన్నది తప్పలేదు. ఏదేమైనా సందీప్ ఇంకా వేరే నిర్మాతవైపు చూడకుండా తనమీద తను ఆధారపడి నమ్మకంతో సినిమా చేసి సక్సస్ అయ్యాడు. ఇప్పుడిదే ఇన్స్పిరేషన్ తో మిగతా యంగ్ హీరోస్ కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసే ఆలోచనలో ఉన్నారని లేటెస్ట్ న్యూస్.



మరింత సమాచారం తెలుసుకోండి: