దాదాపు ఏడాదిన్నరకు పైగా ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమా ఇటీవల విడుదల అవుతుందని ఆగస్టు 15వ తారీఖున రిలీజ్ అవ్వడం ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సాహో సినిమా ఆగస్టు 15న విడుదల అవటం కష్టమని సినిమా విడుదల వాయిదా పడినట్లు ఫిలిం నగర్ లో కొత్త వార్తలు వినబడుతున్నాయి. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో రావటంతో ప్రభాస్ అభిమానులు తల బాదుకుంటున్నరు.


‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత...సుజిత్ దర్శకత్వంలో పూర్తి యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన సాహో సినిమా పై ప్రభాస్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమాను ఆగస్టు 30వ తారీఖున విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.


దీంతో సాహో నిర్మాతలు ఒక్కసారిగా నిర్ణయం తీసుకోవడంతో గతంలో 'సాహో' సినిమా ఆగస్టు 15న విడుదల అవుతుందని భావించి చాలా మంది చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమా విడుదల తేదీలను మార్చడం జరిగింది. అయితే ఒక్కసారిగా సాహో సినిమా ఆగస్టు నెల చివరిలో విడుదలవుతున్న నేపథ్యంలో చిన్న సినిమాల నిర్మాతలు సాహో సినిమా నిర్మాతల పై అసహనం చెందినట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. 


మరింత సమాచారం తెలుసుకోండి: