మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం తెలుగులో ఎంతటి భారీ విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. గతేడాది రిలీజై ప్రపంచవ్యాప్తంగా 235 కోట్ల గ్రాస్ వసూలు చేసి 127 కోట్ల షేర్ సాధించి టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డులను నెలకొల్పింది. చరణ్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకులు సినిమాలో లీనమైపోయేలా చేశారు.

 

ఇప్పుడీ సినిమాను కన్నడ బాషలో రీమేక్ చేశారు మైత్రీ మూవీమేకర్స్ వారు. కన్నడలో 85స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. జూలై 12న విడుదలైన రంగస్థలం మొదటిషోకే యునానిమస్ టాక్ రావడంతో కన్నడలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మొదటిరోజే బెంగళూరులో 26షోలు వేశారు. దీంతో చిట్టిబాబు రీసౌండ్ కన్నడలో కూడా అదిరిపోయింది. కిట్టిగా రామ్ చరణ్ కన్నడ ప్రేక్షకులను కూడా తన నటనతో విపరీతంగా ఆకట్టుకున్నాడు. సినిమా నేపథ్యం కూడా కన్నడిగులకు విపరీతంగా నచ్చటంతో సినిమాకు గ్రాండ్ వెల్ కమ్ పలికారు. మెగా ఫ్యామిలీ హీరోలకు.. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కల్యాణ్ లకు కన్నడలో భారీక్రేజ్ ఉంది. తెలుగులో ఫ్లాప్ అయిన చిరంజీవి రిక్షావోడు కన్నడలో సూపర్ హిట్.

 

రంగస్థలం సినిమాకు కన్నడలో మరో రికార్డు సృష్టించింది. మాయాబజార్ తరువాత ఏ తెలుగు సినిమా కూడా కన్నడ బాషలో డబ్ కాలేదు. కన్నడ చిత్రసీమలో పెట్టుకున్న నియమాలతో ఇప్పటివరకూ పరబాషా సినిమా ఏదీ డబ్ కాలేదు. ఇటివల సడలించిన నిబంధనల ప్రకారం రంగస్థలం డబ్ అయి రికార్డు సృష్టించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: