కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందే 'భారతీయుడు 2' చిత్రం ప్రారంభం అయ్యింది..మొద‌టి షెడ్యూలు కొన్ని రోజులు అయ్యాక‌  ఇంత‌వ‌ర‌కూ త‌దుప‌రి షెడ్యూలు షూటింగుకు వెళ్ళ‌లేదు. ఎందుకంటే శంక‌ర్ తీసిన సినిమాలు అన్నీ ఈమ‌ధ్య ఘోరంగా దెబ్బ‌తిన‌డంతో నిర్మాత‌లు భ‌య‌ప‌డ్డ‌ట్టున్నారు. దీంతో భారీ బ‌డ్జెట్టు వ‌ర్క‌వుట్ అవ‌డంలేద‌నే వాద‌న ఒక‌టి, క‌మ‌ల్‌తో బిజినెస్ అంత‌గా లేద‌నే వాద‌న మ‌రోటి...ఇలా తొలి  షెడ్యూల్ తర్వాత బాగా గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే.

దర్శకుడుకి, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారికి బడ్జెట్టు విషయంలో అభిప్రాయభేదాలు రావడంతో ఇది ఆగిపోయిందంటూ వార్తలొచ్చాయి. ఇటీవల వీరు కూర్చుని మాట్లాడుకున్నారని, పరిమితమైన బడ్జెట్టులో పూర్తి చేయడానికి దర్శకుడు అంగీకరించాడనీ, ఆగస్టు నుంచి షూటింగ్ తిరిగి మొదలవుతుందని తాజా సమాచారం.

ప్ర‌స్తుతం క‌మ‌ల్ త‌న సొంత నిర్మాణంలో అక్ష‌ర‌హాస‌న్ , అభిహాస‌న్  జంట‌గా న‌టిస్తున్న చిత్రం మిస్ట‌ర్ కె.కె. చియాన్ విక్ర‌మ్ కీల‌క పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి విల‌క్ష‌న న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జులై 19న విడుద‌ల కాబోతున్న సంద‌ర్భంగా చిత్ర ప్ర‌మోష‌న్స్ బిజీలో ఆయ‌నున్నారు.  ఈ చిత్రం మంచి హిట్ అయి అటు ఇందులో న‌టించిన న‌టీన‌టుల‌కు, క‌మ‌ల్‌హాస‌న్ కు మంచి  స‌క్సెస్‌రావాల‌ని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: