కసితో రగిలిపోతోంది రకుల్. ఎక్కడైతే తాను టాప్ ప్లేస్ లో నిలిచి చప్పట్లు కొట్టించుకున్నానో అక్కడ ఇపుడు యంగ్ హీరోలు పక్కన పెట్టేయడాన్ని అసలు తట్టుకోలేకపోతోంది. వారి కంటే వయసులో చిన్న అయినా కూడా ఆఫర్లు మాత్రం ఇవ్వకుండా సీనియర్ సిటిజన్ని చేసేసి పక్కన పెట్టేయడాన్ని సహించడంలేదు.


దాంతో రకుల్ తనలో ఉన్నవన్నీ చూపించేస్తోంది. నేనేం తక్కువ అన్నట్లుగా రెచ్చిపోతోంది. కట్లు తెంచుకుని మరీ అందాన్ని వరదలా పారిస్తోంది. పక్కన ఉన్న సీనియర్ హీరోనా లేక మరెవరా అన్నది కూడా అసలు ఆలోచించడం లేదు. మూవీలో  తానున్న సీన్లు కేక పుట్టించాలని డిసైడ్ అయిపోయింది. అంతే.


దాంతో మన్మధుడు 2 లో రకుల్ బోల్డ్ నెస్ అంతా ఒక్కసారిగా బయటపడుతోంది. రివెంజ్ తీసుకునే లెక్కల్లో ఆమె ఉంది. ఈ మూవీ సక్సెస్ తో ప్రూవ్ చేసుకోవాలనుకుంటోంది. కాగా  అవంతికగా న‌టించిన ర‌కుల్ ప్రీత్ సింగ్ పాత్ర‌కు సంబంధించిన ట‌జీర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌కు కూడా హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. దాంతో రకుల్ ఎంతలా ఈ మూవీపై హోప్స్ పెట్టుకుందో అర్ధమవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: