సీనియర్ హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అందం మాత్రమే కాకుండా అద్భుతమైన నటన కూడా ఆమె సొంతం. అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఆమెకు ఇప్పటికే భారీ ఫాలోయింగ్ ఉన్నది. టబు కెరీర్లో ఓ క్లాసిక్ గా మిగిలిన సినిమా అక్కినేని నాగార్జునతో చేసిన నిన్నే పెళ్లాడుతా. 1996లో విడుదలైన ఈ సినిమాలో నాగ్-టబు రొమాన్స్ అప్పట్లో రాపేక్షకులను గిలిగింతలు పెట్టింది.


ఇక అసలు విషయానికి వస్తే.... టబు తాజాగా ఐదివా మ్యాగజైన్ లేటెస్ట్ ఎడిషన్ కోసం ఫోటో షూట్ చేసింది. విభిన్నమైన దుస్తుల్లాలో ఫోజులు ఇచ్చింది. ఈ జనరేషన్ బ్యూటీలకు గట్టి పోటీ అన్నట్లుగా అందాల ప్రదర్శన చేసింది. 


ఆ ఫోటోలు చూసిన వారు టబు కి 47ఏళ్ళు అంటే నమ్మలేరు. కళ్ళలో ఆ ఇంటెన్సిటీ.. ఫేస్ లో గ్లో చూస్తుంటే టబు మాయలో పడిపోకుండా ఉండలేరు.  టబు లాస్ట్ ఇయర్ 'అంధా ధున్' చిత్రంలో అద్భుతమైన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: