‘సాహో’ విడుదల మరొకసారి వాయిదా పడినట్లు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఈ సినిమా విడుదలకు కనీసం నెలరోజుల సమయం కూడ లేకపోవడం వేర్వేరు నగరాలలో మూడు టీమ్ లు ఈసినిమా వీఎఫ్ఎక్స్ పనులతో బిజీగా ఉండి పరుగులు తీస్తున్నా ఫలితం అనుకున్న స్థాయిలో రాకపోవడంతో ఇక ఈవిషయంలో ఆఖరి నిముషం టెన్సన్స్ వద్దు అనుకుని ‘సాహో’ విడుదల ఆగష్టు 15 నుండి మరొక తేదీకి వాయిదా పడినట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి ఈ వాయిదాకు సంబంధించి ‘సాహో’ నిర్మాతల నుండి ఎటువంటి ప్రకటన రాకపోయినా ఆ తేదీకి చిన్న సినిమాలు రెండు విడుదల అవుతున్నట్లుగా వచ్చిన అధికారిక ప్రకటనతో ‘సాహో’ వాయిదా ఖరార్ ఐంది. ఆగస్టు 15 న అడవి శేషు ‘ఎవరు’ శర్వానంద్ ‘రణరంగం’ విడుదల కన్ఫమ్ కావడంతో ‘సాహో’ వాయిదాను పరోక్షంగా ధ్రువీకరించారు.

వాస్తవానికి ‘సాహో’ టీమ్ ను నిద్రలేకుండా ప్రభాస్  పరుగులు తీయించి  అనుకున్న తేదీకి విడుదల అయ్యేలా చేయవచ్చు. అయితే అలంటి సాహసం చేయడం ప్రభాస్ కు ఇష్టంలేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ‘సాహో’ మ్యానియాను లెక్కచేయకుండా అక్షయ్ కుమార్  ‘మిషన్ మంగళ్’ జాన్ అబ్రహం ‘బాట్లా హౌస్’ సినిమాలు బలమైన కధలతో విడుదల అవుతున్న పరిస్థితులు కూడ ప్రభాస్ ను వెనుక అడుగు వేసేలా చేసాయి అని అంటున్నారు. 

దీనితో ‘సాహో’ మూవీ మరొకసారి విడుదల  అయ్యే తేదీ గురించి అప్పుడే ఆలోచనలు మొదలు అయిపోయాయి. ప్రభాస్ కోరుకున్న విధంగా ‘సాహో’ పనులు అన్నీ  ఎటువంటి హడావిడి లేకుండా పూర్తి అవ్వాలి అంటే మరొక ఆరు వారాలు పడుతుంది. అప్పుడు ‘సాహో’ విడుదలకు రెడీ అయినా అక్టోబర్ లో దసరాను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ‘సైరా’ అడ్డు తగులుతుంది. దీనితో నవంబర్ వరకు ‘సాహో’ కు సరైన డేట్ లేదు. ఏది ఎలా ఉన్నా అభిమానులు నీరసించిపోయే నిర్ణయం ప్రభాస్ తీసుకున్నాడు అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: