మహేష్ బాబు కెరీర్లో పోకిరి సినిమాకు ఒక గుర్తింపు ఉంది.  ఈ సినిమా మహేష్ కు మైలురాయిగా నిలిచింది.  అంతకు ముందు మహేష్ సినిమాలు చాలా సాఫ్ట్ గా ఉండేవి.  పోకిరిలో మహేష్ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తారు.  బహుశా పూరితో సినిమాలు చేయడానికి హీరోలు అందుకే ఆసక్తి చూపిస్తారనుకుంటా.  


ఈ మూవీలో మహేష్ బాబు రౌడీగా కనిపిస్తారు. మాఫియా గ్యాంగ్ తో కలిసి తిరుగుతుంటాడు.  డబ్బు కోసం ఏ పనులైనా చేస్తుంటాడు.  డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి.  ఇది సూపర్ హిట్టైంది.  ఇందులో క్లైమాక్స్ ముందు వచ్చే సీన్ సినిమాకు హైలైట్ గా నిలిచింది.  


ఈ ట్విస్ట్ చాలా చిన్నదే.  ప్రభావం ఎక్కువ చూపింది.  అప్పటి వరకు నాజర్ కొడుకుగా అజయ్ పరిచయం అవుతాడు.  నాజర్ ను విలన్ చంపిన తరువాత అసలు విషయం బయటపడుతుంది.  నాజర్ తో కృష్ణ మనోహర్ ఐపీఎస్.. బ్యాడ్జి నెంబర్ 32567 అని చెప్తాడు.  


ఐపీఎస్ సరే ఈ బ్యాడ్జ్ నెంబర్ ఏంటి ఎక్కడిది .. ఏదో పెట్టాలి కాబట్టి ఆ నెంబర్ పెట్టారు అనుకుంటే పొరపాటే.   ఈ నెంబర్ పూరి ఫోన్ నెంబర్ అట.  షూటింగ్ కు ముందు సీన్స్ లో ఈ నెంబర్ ను చేర్చారు.  సినిమా షూటింగ్ సమయంలో మహేష్ పోలీస్ ఆఫీసర్ గా ఎక్కడా రివీల్ చేయకపోవడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: