‘బిగ్ బాస్’ వివాదాలు రోజురోజుకు ముదిరి పోవడంతో ఈ షో విషయమై కోర్ట్ మెట్లు ఎక్కిన కొన్ని కేసులు విషయమై కోర్టు ఎలా స్పందిస్తుంది అన్న ఆసక్తి పెరిగిపోయింది. జరుగుతున్న పరిణామాలను పసిగట్టిన ‘బిగ్ బాస్’ షో నిర్వాహకులు కోర్టులో క్వాష్ పిటీషన్ ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. 

అయితే ఈవిషయాలు ఏమి పట్టించుకోకుండా ‘బిగ్ బాస్’ షో విషయమై పోరాటం చేస్తున్న శ్వేతా రెడ్డి మరొక బాంబు పేల్చింది. ‘బిగ్ బాస్’ అనేది ఒక బిగ్ ట్రాప్ షోగా మారిందని ఆ ట్రాప్ లో సుమారు 40 మంది అమ్మాయిలు చిక్కుకున్నారు అంటూ మరొక లేటెస్ట్ సంచలన విషయాన్ని బయటపెట్టింది. 

అంతేకాదు మరికొందరైతే తాను ఈ విషయం పై పోరాటం చేస్తున్నందుకు వివాదాస్పద వ్యక్తిగా ముద్రవేసి తనకు ఏమి అర్హత ఉందని ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నావు అంటూ ప్రశ్నిస్తున్న విషయాన్ని బయట పెట్టింది. అంతేకాదు ఒక్క సెలెబ్రెటీలకు తప్ప తనలాంటి సామాన్యులకు ప్రశ్నించే హక్కు లేదా అంటూ శ్వేతా రెడ్డి ప్రశ్నలు వేస్తోంది. 

ఇది ఇలా కొనసాగుతూ ఉంటే కోర్టు కేసులో బిగ్ బాస్ షో నిర్వాహకులతో పాటు నాగార్జునను కూడ ప్రతివాదిగా చేర్చారు అని వస్తున్న వార్తలు మరింత కలకలం సృష్టిస్తున్నాయి. దీనితో రాబోతున్న ఆదివారం ప్రారంభం కాబోతున్న ఈ షో సజావుగా నడిచే ఆస్కారం ఉందా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: