వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కుటుంబ బంధాలకు  సెంటిమెంట్స్ కు చాలా దూరంగా ఉంటాడు. వర్మ తీరునచ్చక అతడి కూతురు కూడ వర్మకు దూరంగా ఉంటుంది.  అలాంటి రామ్ గోల్ వర్మ  తన మేనకోడలు శ్రావ్య వర్మను ప్రమోట్ చేస్తున్న తీరు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో సంచలనంగా మారింది. 

కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ ను ప్రారంభించిన శ్రావ్య వర్మకు అవకాశాలు ఇమ్మని వర్మ తనకు తెలిసిన దర్శకులను అడుగుతున్నట్లు సమాచారం. ఇదిచాలదు అన్నట్లుగా ఇప్పడు ఈమె నిర్మాతగా మారడం మరింత సంచలన వార్తగా మారింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని శ్రావ్య వర్మ మరో నిర్మాతతో కలిసి నిర్మించింది. నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో కీలకపాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు.  

ఇప్పుడు ఈ సినిమాకు సమర్పకుడి గా దిల్ రాజ్ వ్యహరించడం వెనుక వర్మ రాయబారాలు ఉన్నాయి అని అంటున్నారు. దిల్ రాజు ఈ సినిమాకు సమర్పకుడిగా మారడంతో ఈ మూవీ బిజినెస్ కూడ చాలా సులువుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ పరిణామాలు ఇలా కొనసాగుతూ ఉంటే తన మేనకోడలు శ్రావ్య వర్మ నిర్మాతగా విజయం సాధిస్తుంది అంటూ శుభాకాంక్షలు తన ట్విటర్ లో తెలియచేసాడు. ఇప్పటికే  కాస్ట్యూమ్ డిజైనర్ గా కొన్ని సినిమాలకు పనిచేసిన శ్రావ్య వర్మ నిర్మాతగా మారడం వెనుక వర్మ ప్రోత్సాహం ఓపెన్ గా కనిపిస్తోంది. దీనితో కుటుంబాన్ని పెద్దగా పట్టించుకోని వర్మ తన మేనకోడలిని ప్రమోట్ చేస్తుండటంతో చాలామంది ఆశ్చర్యపడుతూ వర్మ మారిపోయాడా అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: