Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 8:09 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ ౩ లో శ్రీలంక న్యూస్ యాంకర్..

బిగ్ బాస్ ౩ లో శ్రీలంక న్యూస్ యాంకర్..
బిగ్ బాస్ ౩ లో శ్రీలంక న్యూస్ యాంకర్..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్ బాస్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు జరిగిన రెండు సీజన్స్ ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. అయితే ప్రస్తుతం మరి కొద్ది రోజుల్లో మూడవ సీజన్ స్టార్ట్ కాబోతుంది. అయితే ఆ సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరా అని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. సాధారణంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరనేది షో స్టార్ట్ అయ్యే వరకు తెలీదు. కానీ ప్రజల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని పుకార్లు మాత్రం బయటకు వస్తుంటాయి.


తెలుగులో ఈ షో మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుండగా, తమిళం లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే ఈ షో పుణ్యమా అని అప్పటి దాకా కాస్తోకూస్తో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లంతా ఓవర్‌నైట్ స్టార్స్ అయిపోతున్నారు. అప్పటి వరకూ సినిమాల్లో, టీవీల్లో వచ్చిన క్రేజ్‌కు, బిగ్‌బాస్‌తో తెచ్చుకున్న క్రేజ్‌కుతేడా ఎలా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


తమిళ బిగ్‌బాస్ 3 వివాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాల సంగతి కాసేపు పక్కన పెడితే తమిళ బిగ్‌బాస్ 3షోలో సెకండ్ కంటెస్టంట్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలంక న్యూస్ యాంకర్ లోస్లియా మరియానేసన్ తమిళ కుర్రకారు గుండెల్లో గుబులురేపుతోంది. ఆమె అందమైన ఫొటోలతో యువత తమ ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలను నింపేస్తున్నారు.


అప్పట్లో ఒవియాకు కూడా ఈ రేంజ్ క్రేజ్ వచ్చింది. ఇప్పుడు తాజాగా బిగ్‌బాస్ 3 అభిమానుల ఫోకస్ లోస్లియాపై పడింది. లోస్లియా తన ప్రవర్తన, మాట తీరుతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే.. ఈ పాపులారిటీ ఆమెకు ఏ మాత్రం కలిసొస్తుందో వేచిచూడాలి. కానీ ఒకటి మాత్రం నిజం బిగ్ బాస్ వల్ల పాపులారిటీ ఎంత సంపదిస్తున్నారో వివాదాలు కూడా అలానే చుట్టుముడుతున్నాయి. కౌషల్ ఆర్మీ గురించి అందరికీ తెలిసిందే.


big-boss
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

WORK LIKE A SERVANT AND LIVE LIKE A KING