తెలుగులో ఎన్టీయార్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్టైంది. నాని హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 2 కూడా తెలుగులో హిట్ అయింది. కానీ ఈ రెండు సీజన్లలో రాని ఇబ్బందులు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 కు వచ్చాయి. ఈ సమస్యల వలన సీజన్ 3 హోస్ట్ చేయబోతున్న నాగార్జున ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. కాస్టింగ్ కౌచ్ వివాదాలతో బిగ్ బాస్ సీజన్ 3 కు సమస్యలు మొదలయ్యాయి. 
 
యుట్యూబ్ యాంకర్ శ్వేతా రెడ్డి బిగ్ బాస్ షో కోఆర్డినేటర్స్ ను ఉద్దేశించి బిగ్ బాస్ షోలో ఛాన్స్ ఇస్తే మా బాస్ ను ఎలా ఇంప్రెస్ చేస్తావని అడిగారని బిగ్ బాస్ షో పేరుతో మహిళల్ని మోసం చేస్తున్నారని అన్నారు. మీరు బాడీ ఎప్పుడు తగ్గించుకుంటారని అడిగారని ఇందులో నలుగురు ముఖ్యంగా ఉన్నారని శ్వేతా రెడ్డి అన్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బిగ్ బాస్ షో కోఆర్డినేటర్స్ పై కేసు కూడా పెట్టారు. మరో సినీ నటి గాయత్రి గుప్తా బిగ్ బాస్ సీజన్ 2 సమయంలో 100 రోజులు సెక్స్ లేకుండా ఉండగలవా అని తనను అడిగారని బిగ్ బాస్ సీజన్ 2లో అవకాశం వచ్చిందని ఆరు సినిమాలు వదిలేసుకున్నానని కానీ  అవకాశం ఇవ్వకుండా మోసం చేసారని గాయత్రి గుప్తా అన్నారు. 
 
మరో వైపు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నాగార్జునతో పాటు బిగ్ బాస్ షోకు చెందిన కొంతమందిని ప్రతివాదులుగా చేరుస్తూ బిగ్ బాస్ షోను సెన్సార్ చేసి రాత్రి 11 గంటల తరువాత ప్రసారం చేయాలని హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ధాఖలు చేసారు. బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తున్నందుకు షో ప్రారంభం కాకముందే నాగార్జున తన తప్పు లేకపోయినా ఇన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నాడు. మరి ఈ కేసుల వలన బిగ్ బాస్ షో ఆదివారం  ప్రసారం అవుతుందో లేదో చెప్పడం కష్టమే. 



మరింత సమాచారం తెలుసుకోండి: