తాజాగా  విక్టరీ వెంకటేష్‌-నాగ చైతన్య మామ అల్లుళ్లుగా క‌లిపి న‌టిస్తున్న సినిమా “వెంకీ మామ”. ఈ చిత్రంలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంకు జై ల‌వ‌కుశ సినిమా డైరెక్ట‌ర్ కేఎస్‌ రవీంద్ర(బాబి) ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలి సారి రియ‌ల్ మామ అల్లుళ్లయిన వెంకటేష్,నాగ చైతన్య న‌టిస్తున్న‌ ఈ సినిమాపై బాగానే అంచ‌నాలు ఉన్నాయి.


ఉగాది సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ లోగోను విడుదల చేసింది. ఆ త‌ర్వాత ఈ సినిమా గురుంచి ఎంటువంటి అప్డేట్ లేకపోవడం వెంకటేష్,నాగ చైతన్య అభిమానులు బాగా హ‌ర్ట్ అవుతున్నారు. సోష‌ల్ మీడియాలో ఈ సినిమాను టార్గెట్‌గా చేసుకుని కామెంట్లు పెడుతున్నారు. ఈ మూవీ చిత్రీకరణ ప్ర‌స్తుతం క‌శ్మీర్‌లో జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా గురించి వెంకీ మామ టైటిల్ పోస్టర్ మినహా ఎలాంటి స‌మాచారం బ‌య‌ట‌కు రాలేదు.


దసరా కానుకగా విడుదల అయ్యేఅవకాశం ఉన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం స్టిల్స్ గానీ, వెంకీ,చైతూల లుక్స్ లాంటివి విడుద‌ల చేయ‌డం వ‌ల్ల సినిమాకు మంచి హైప్ తీసుకువ‌స్తాయి. కానీ చిత్ర బృందం ఏ అప్డేట్స్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ చాలా సీరియ‌స్‌గా ఉన్నారు. మ‌రి ఇప్ప‌టికేనా వాళ్ల ఆవేద‌న అర్థం చేసుకుని ఏమైనా స్టిల్స్ గానీ, ప్రోమోలు లాంటివి రిలీజ్ చేస్తారో? లేదో? చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: