ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. కెరీర్ మొదట్లో ఫ్లాపులే వచ్చినా దువ్వాడ జగన్నాథం, అరవిందసమేత వీరరాఘవ, మహర్షి సినిమాలతో వరుస హిట్లు కొట్టింది. రంగస్థలం సినిమాలో పూజా హెగ్డే చేసిన ఐటమ్ సాంగ్ కు కూడా మంచి పేరు వచ్చింది. టాలీవుడ్లో ప్రస్తుతం నెంబర్ 1 పొజిషన్లో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే మాత్రమే. 
 
ప్రస్తుతం పూజా హెగ్డే అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో నటిస్తుండగా ప్రభాస్ తరువాత సినిమాలో కూడా పూజానే హీరోయిన్ గా ఎంపికయింది. ఇలా అందరు స్టార్ హీరోలతో నటిస్తున్న పూజా హెగ్డేకు వరుణ్ తేజ్ హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న వాల్మీకి సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. వాల్మీకి సినిమాలో హీరోయిన్ పాత్ర కేవలం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. రెండు పాటలు, కొన్నిసీన్లు మాత్రమే హీరో హీరోయిన్ కాంబినేషన్లో ఉంటాయి. 
 
అందువలన ఈ సినిమా కోసం కేవలం పూజా హెగ్డే పది రోజుల కాల్షీట్స్ మాత్రమే కావాలట. ఈ పది రోజుల కోసం పూజా హెగ్డే రోజుకు 15 లక్షల చొప్పున కోటిన్నర డిమాండ్ చేసింది. ఇంత చిన్న పాత్రకు మరే స్టార్ హీరోయిన్ ఒప్పుకోకపోవటం, పూజా హెగ్డే తెలుగులో నెంబర్ 1 హీరోయిన్ గా ఉండటం వలన దర్శక నిర్మాతలు కోటిన్నర ఇవ్వటానికి సిధ్ధమయ్యారట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను పూజా హెగ్డే బాగానే ఫాలో అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: