రకుల్ ప్రీతీ సింగ్ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ మంట రేపుతుంటుంది. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా మొత్తం విదేశాల్లో షూట్ చేశారు. అందుకే అక్కడ నివసించే అమ్మాయి పాత్రలో రకుల్ నటిస్తోంది. దీంతో విదేశీ అమ్మాయి ఎలా ఉంటుందో రకుల్‌ను అలాగే చూపించడానికి దర్శకుడు ప్రయత్నించాడట.


ఇందులో భాగంగానే సిగరెట్ కాల్చడం, మందు తాగడం, బోల్డుగా మాట్లాడడం కూడా ఉంటుందని ఇప్పటికే టీజర్‌లో చూపించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం దర్శకుడు రకుల్‌ను సరికొత్త లుక్‌లో చూపించాడని తెలుస్తోంది. ముఖ్యంగా ఆమెతో భారీగా క్లీవేజ్ షో చేయించాడని ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. తాజాగా విడుదలైన ‘మన్మథుడు 2' పోస్టర్లలో ఉన్న దానికంటే ఎక్కువగానే ఇందులో చూపించాడని సమాచారం. మొత్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా బోల్డు లుక్కులో రకుల్ ఈ సినిమాలో కనిపించబోతుందట. 


బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌తో చేసిన ‘దే దే ప్యార్ దే'లో రకుల్ ఎంతలా రెచ్చిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా కోసం ఆమె చేసిన క్లీవేజ్ షోకు తెలుగు ప్రేక్షకులు షాక్ అయ్యారు. బ్యాక్ లెస్ కాస్ట్యూమ్‌తో ఉల్లిపొర లాంటి చీర కట్టుకుని నడుముని ఫుల్‌గా ఎక్స్ పోజ్ చేస్తూ రకుల్ చేసే డాన్స్, దానికి తోడు మందు బాటిల్ పట్టుకోవడం అప్పట్లో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: