ప్రస్తుతం తెలుగు టెలివిజన్ లో వస్తున్న ‘జబర్ధస్త్’ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ ప్రోగ్రామ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.  ‘జబర్ధస్త్’ తో ఎంతో మంది కళాకారులు ఇప్పుడు మంచి పొజీషన్ లోకి వచ్చారు.  మరికొంత మంది అయితే వెండి తెరపై తమ టాలెంట్ చూపిస్తూ కమెడియన్లుగా కొనసాగుతున్నారు.  తాజాగా  ‘జబర్ధస్త్’ లో లేడీ గెటప్ వేసుకొని ఎన్నో స్కిట్స్ లో నటిస్తున్న శాంతి స్వరూప్  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తమపై ఇటీవల కాలంలో వస్తున్న వార్తలపై స్పందించారు. 

ఏపిలో ఎన్నికల ముందు   వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన ప్రజలను కలిసి వారి కష్టసుఖాలను దగ్గరుండి చూసి వారికి భరోసా ఇచ్చారు.  ఈ సమయంలో ‘జబర్దస్త్’ కామెడీ షోతో పాపులరైన శాంతి స్వరూప్, వినోద్ కూడా జగన్‌తో నడిచారు. వీరిద్దరూ జబర్ధస్త్ లో లేడీ గెటప్ లో నటిస్తుంటారు.  అయితే, జగన్ పాదయాత్రలో పాల్గొనడం కారణంగా శాంతి స్వరూప్, వినో‌ద్‌లను ‘జబర్దస్త్’ నుంచి తొలగించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

తాజాగా దీనిపై స్పందించిన శాంతి స్వరూప్ మేం జగన్ గారి పాదయాత్రకు వెళ్లిన మాట నిజమే. కానీ.. ఆ పాదయాత్రకు, మమ్మల్ని పక్కన పెట్టడానికి సంబంధం లేదు. మేంఅపుడు జబర్దస్త్ మానేసి వెళ్లాం.  అప్పుడు తెలియనితనంతో నేను, వినోద్ వాళ్లు పిలిచారు కదా అని వెళ్లిపోయాం. మేం వెళుతున్న విషయం టీమ్ లీడర్లకు చెప్పాం. కానీ, వారు మేనేజ్ చేయలేకపోయారు.  ఆ సమయంలో జబర్ధస్త్ స్కిట్ లో లేడీ పాత్రలకు కాస్త ఇబ్బంది కలిగిన విషయం మాకు తెలిసిందే. మా పాత్రలు భర్తీ చేయడానికి అక్కడ ఎవ్వరూ లేరు.

ఈ విషయంలో డైరెక్షన్ డిపార్టుమెంటుకు మాపై కోపం లేదు. కానీ, ఇంకొకరు ఇలా చేయకూడదు అని మాపై మూడు నెలల నిషేదం విధించారు. వాస్తవానికి మమ్ముల్ని నమ్ముకొని స్కిట్స్ తయారు చేసిన తర్వాత మేం అలా వెళ్లడం తప్పే. జగన్ పాదయాత్రలో పాల్గొనడం వల్లే తమను తీసేశారని వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఇలాంటి వార్తలు నమ్మవద్దని జబర్ధస్త్ అభిమానులకు తెలియజేస్తున్నానని శాంతి స్వరూప్ చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: