ఇపుడున్న సమాజంలో ఏ రంగంలో సెటిల్ అవాలన్నా, సక్సెస్ ఫుల్ జర్నీ చేయాలన్నా కూడా  కొన్ని సడలింపులు తప్పనిసరి అయిపోయింది. ముక్కుసూటితనంగా ఉంటే అసలు కుదిరే వ్యవహారం కావట్లేదు. అయితే రాశి తగ్గినా కూడా ఇప్పటికీ తాము అనుకున్నది చేసేవారు, తామేంటో కచ్చితంగా ప్రూఫ్ చేసుకునే వాళ్ళు  కూడా ఉన్నారు. 


సినీ రంగంలో అలాంటి వారిలో సాయి పల్లవిని ముందు చెప్పుకోవాలి. హీరోయిన్ గా పాపులర్  అయిన ఈ కన్నడ కస్తూరికి చాలా ప్రిన్సిపుల్స్ ఉన్నాయి. వాటిని లోబడి మాత్రమే ఆమె సినిమాలు చేస్తుంది. ఎంత పెద్ద స్టార్ అయినా కూడా, ఎంత గొప్ప బ్యానర్ అయినా కూడా తనకు నచ్చకపోతే నో చెప్పేస్తుంది. 


ఇక డియర్ కామ్రెడ్ సినిమాలో  హీరోయిన్ గా మొదట సాయి పల్లవిని ఎంపిక చేశారుట. అయితే అందులో లిప్ లాక్ సీన్ కంపల్సరీ అని డైరెక్టర్ భరత్ కమ్మ చెప్పడంతో సాయి పల్లవి నో అనేసిందట. ఆ విధంగా ఆ మూవీని ఈ అమ్మడు పోగొట్టుకుందిట. అయితే లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ లో మాత్రం విజయ్, రష్మిక ఉన్న లిప్ లాక్ ఇపుడు యూత్ ని వూపేస్తోంది. 


ఇంతటి రెస్పాన్స్ ఉంటుందనే ఆ సీన్ పెట్టాలనుకున్నారుట. మరి సాయి పల్లవి కి ఆ సీన్లు చేయడం ఇష్టం లేదు. అందుకే నో అనేసింది. ఏది ఏమైనా కూడా ఇపుడున్న వారిలో సాయి పల్లవి ఇలా కచ్చితంగా ఉండడం చూస్తే గ్రేట్ అనక తప్పదేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: